Asianet News TeluguAsianet News Telugu

కత్తి మహేష్ చికిత్సకు ఏపీ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ. 17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి లేఖ విడుదల చేశారు.

kathi mahesh : AP CM YS Jagan offers hube amount for medical expenses - bsb
Author
Hyderabad, First Published Jul 2, 2021, 5:19 PM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ చికిత్స కోసం 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ. 17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి లేఖ విడుదల చేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఈ నగదు అందించారు. ఇటీవల నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం అతన్ని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

కాగా,  జూన్ 26 న నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్  ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కత్తి కత్తి మహేష్ కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. కత్తి మహేష్ నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలం, చంద్రశేఖర్ పురం జాతీయ రహదారిపై ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు ఆయన కారు వెనుక నుండి లారీని ఢీకొట్టింది. 

లేటెస్ట్ హెల్త్ అప్ డేట్‌ : కోలుకుంటున్న కత్తి మహేష్‌.....
ఈ ప్రమాదం జరిగిన వెంటనే కత్తి మహేష్ ని నెల్లూరు మెడికేర్ హాస్పిటల్ లో చేర్చడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో కత్తి మహేష్ కి బలమైన గాయాలు తగిలినట్లు సమాచారం. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తలకు గాయాలు కావడం ఆందోళన కలిగిస్తుంది. 

ఇక పవన్ కళ్యాణ్ పై అనేక విమర్శలు చేసిన కత్తి మహేష్ వివాదాలతో చాలా పాప్యులర్ అయ్యారు. కాటమరాయుడు మూవీకి నెగిటివ్ రివ్యూ ఇచ్చిన కత్తి మహేష్ పై పవన్ ఫ్యాన్స్ దాడికి దిగడం జరిగింది. అలాగే రామాయణం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ గతంలో నగర బహిష్కరణకు గురికావడం జరిగింది.  

Follow Us:
Download App:
  • android
  • ios