వైసీపీలో గౌరు చరితారెడ్డి కి ఊహించిన షాక్ తగిలింది. పాణ్యం వైసీపీ టికెట్ తనదేనంటూ కాటసాని  రామ్ భూపాల్ రెడ్డి ప్రకటించుకుంటున్నారు. కాటసాని.. ఇటీవల బీజేపీ నుంచి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. నాలుగు దఫాలుగా పాణ్యం లో రామ్ భూపాల్ రెడ్డి విజయ ఢంకా మోగిస్తూ వస్తున్నారు. దీంతో.. ఈసారి కూడా విజయం తనదేననే ధీమాతో ఉన్నారు కాటసాని.

ఇదే విషయంపై కాటసాని తాజాగా మీడియాతో మాట్లడారు. పాణ్యం టికెట్ జగన్.. తనకే ఇస్తానని మాట ఇచ్చారని చెప్పారు. తన టికెట్ విషయంలో ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.  కాగా.. కాటసాని ప్రకటనతో దివంగత నేత వైఎస్ కి సన్నిహితురాలైన గౌరు చరితారెడ్డి రాజకీయ భవిత్యంపై అనుమానాలు మొదలౌతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కాటసాని పలు విమర్శలు చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీతో సంబంధాలు కొనసాగించి.. ఎన్నికలు దగ్గరపడగానే మాట మార్చారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం అని తేల్చి చెప్పారు.