కార్తీకమాసారంభం : గోదావరిలో భక్తుల పవిత్ర స్నానాలు.. శివనామ స్మరణతో మారుమోగుతున్న ఆలయాలు...
కార్తీకమాసం ప్రారంభ దృష్ట్యా శ్రీకాళహస్తి దేవస్థానంలో దర్శన వేళలో మార్పులు చేశారు. మరోవైపు గోదావరిలోని స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి.

రాజమండ్రి : నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై కార్తీక మాసోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. ఈనెల 26న కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడలో కోటి దీపోత్సవం ఉండనుంది. ఈనెల 28న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుండడంతో రాజమండ్రిలో స్నాన ఘట్టాలు భక్తులతో కితకిలాడిపోతున్నాయి. స్నానాల అనంతరం గోదావరిలో భక్తులు దీపాలు వదులుతున్నారు. కార్తీక స్నానాల కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
రాజమండ్రిలోని పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమిఘాట్ పుణ్యస్నానాలు చేయడానికి వచ్చిన భక్తులతో కిటకిటిలాడిపోతున్నాయి. కార్తీక స్నానాల తరువాత శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. భక్తులు నదిలో వదిలిన కార్తీకదీపాలతో గోదావరి దీపతోరణంలా కనిపిస్తోంది. పాలకొల్లులోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భీమవరం పంచారామ క్షేత్రంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో : ఆమోదం పొందిన అంశాలివే...
అన్ని దేవాలయాల్లోనూ భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. సామర్లకోట పంచారామ క్షేత్రం కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తులు తెల్లవారుజాము నుంచే కార్తీక స్నానాలు ఆచరించి పూజలు చేస్తున్నారు. ద్రాక్షారామ పంచరామ క్షేత్రం భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో కూడా కార్తీకమాసం ప్రారంభం దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. కార్తీకమాస ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం దర్శన వేళలో మార్పులు చేశారు ఆలయ అధికారులు. ఉదయం నాలుగు గంటల నుంచి ఆలయం తెరిచి ఉంచి ఐదు గంటలకు భక్తులను దర్శనాలకు అనుమతినిచ్చారు. రాత్రి 9 గంటలకు భక్తుల దర్శనాలు పూర్తవనున్నాయి.