అసలు ఛైర్మన్ నియామకంలో ప్రభుత్వం అనుసరించిన విధానాలేమిటని న్యాయస్ధానం వేసిన ప్రశ్నకు ప్రభుత్వ న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోయారు. తదుపరి ఛైర్మన్ నియామకాన్ని ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా మాత్రమే  భర్తీ చేయాలని కూడా స్పష్ట చేయటం గమనార్హం.

చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా ఇటీవలే ప్రభుత్వం నియమించిన కారెం శివాజి నియామకం చెల్లదని న్యాయస్ధానం తీర్పు చెప్పింది. తదుపరి ఛైర్మన్ నియామకంలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వటం ద్వరా మాత్రమే భర్తీ చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించటం గమనార్హం.

ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా కారెం శివాజిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు నియమించారు. అయితే, శివాజి నియామకాన్ని సవాలు చేస్తూ ఒక పిటీషన్ దాఖలైంది. ఎస్సీలో ఒక వర్గానికి అధ్యక్షునిగా కొనసాగుతున్న శివాజిని మొత్తం ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి బాధ్యత వహించాల్సిన కమిషన్ కు ఛైర్మన్ గా నియమిస్తారంటూ పిటీషనర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే విషయంగా న్యాయస్ధానంలో కూడా కేసు దాఖలు చేసారు.

 దాంతో ప్రభుత్వం కూడా తన వాదనను వినిపించింది. అసలు ఛైర్మన్ నియామకంలో ప్రభుత్వం అనుసరించిన విధానాలేమిటని న్యాయస్ధానం వేసిన ప్రశ్నకు ప్రభుత్వ న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోయారు. దాంతో శుక్రవారం విచారణ సందర్భంగా కారెం శివాజి నియామకాన్ని రద్దు చేస్తూ న్యాయస్ధానం తీర్పు చెప్పింది. అంతే కాకుండా తదుపరి ఛైర్మన్ నియామకాన్ని ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని కూడా స్పష్ట చేయటం గమనార్హం.