విశాఖలో సమావేశమైన కాపు నేతలు: ఫోరం ఫర్ బెటర్ ఏపీ వేదిక ప్రారంభం
విశాఖలో కాపు నేతలు ఆదివారం నాడు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచారణపై చర్చించారు. గతంలో కూడా కాపు నేతలు సమావేశమయ్యారు.
విశాఖపట్టణం: పార్టీలకు అతీతంగా కాపు నేతలు ఆదివారం నాడు Visakhapatnamలో సమావేశమయ్యారు. కొంత కాలంగా కాపు నేతల సమావేశాలపై ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ సాగుతుంది.
మాజీ మంత్రులు Ganta Srinivasa Rao, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ డీజీపీ Sambasiva Raoతదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ అనే వేదికను ఈ సందర్భంగా ప్రారంభించారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై కాపు నేతలు చర్చించారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.సామాజిక అసమానతలను తొలగించుకొనేందుకు ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేశామని మాజీ డీజీపీ సాంబశివరావు మీడియాకు తెలిపారు. బహుజనులను కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని కలుపుకొని తాము ముందుకు వెళ్తామన్నారు.
ప్రతి ఐదేళ్లకు ఓసారి ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందంటేనే ఏపీ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని అర్ధమౌతుందని సాంబశివరావు అభిప్రాయపడ్డారు.
2021 డిసెంబర్ చివరి వారంలో కాపు నేతలు హైద్రాబాద్ లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు విషయమై Kapu సామాజిక వర్గానికి చెందిన నేతలు చర్చించారు. ఈ సమావేశం తర్వాత ఈ ఏడాది జనవరి 23న కాపు నేతలు జూమ్ మీటింగ్ ద్వారా సమావేశమయ్యారు. కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత Mudragada Padmanabhamతో బీసీ, దళిత నేతలు కూడా ఈ ఏడాది జనవరి మాసంలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రాజ్యాధికారం కోసం ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని ముద్రగడ కోరారు. అయితే దళితులు, బీసీలతో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
కాపు నేతల సమావేశాలపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య గతంలోనే సంచలన వ్యాఖ్యలుచేశారు. ఇదిలా ఉంటే ఈ సమావేశాల విషయమై TDP , YCP నేతలు కూడా ఆరా తీస్తున్నాయి. Andhra Pradesh రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సుమారు 12 శాతం ఉంటారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాపు సామాజిక ఓటర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు.ఈ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే కాపులు రాజకీయాధికారాన్ని దక్కించుకోవడం కోసం సమావేశాలు నిర్వహించడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే ఈ సమయంలోనే రాజకీయ ప్రత్యామ్నాయం కోసం కాపు నేతలు సమావేశాలు నిర్వహించడం ప్రస్తుతం రాకీయవర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజా రాజ్యంతో పాటు జనసేనపై కూడా గత సమావేశాల్లో కాపు నేతలు చర్చించినట్టుగా ప్రచారం కూడా సాగింది. ఈ ఇద్దరు నేతలు కూడా రాజకీయంగా విపలమయ్యారని నేతలు ఈ సమావేశాల్లో అభిప్రాయపడినట్టుగా సమాచారం.
అయితే ఏపీ రాష్ట్రంలో బీజేపీ కూడా రాజకీయంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేనతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లనుంది.ఈ తరుణంలో కాపు నేతల సమావేశాలు ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.