జగన్‌ను వెంటాడుతున్న కాపులు.. పాదయాత్రకు నిరసన సెగ

First Published 4, Aug 2018, 1:15 PM IST
kapu leaders attack on Ys jagan praja sankalpa yatra in East Godavari District
Highlights

కాపు రిజర్వేషన్‌ అంశంపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై కాపు సామాజిక వర్గం భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి ఆయన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటున్నారు కాపులు

కాపు రిజర్వేషన్‌ అంశంపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై కాపు సామాజిక వర్గం భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి ఆయన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటున్నారు కాపులు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తోన్న జగన్‌ను కాపు నేతలు మరోసారి అడ్డుకున్నారు.

గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఫ్లకార్డులు పట్టుకున్న కాపు నేతలు, కార్యకర్తలు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొందరైతే నల్లజెండాలు పట్టుకుని వాటర్ ట్యాంకులు ఎక్కి నినాదాలు చేశారు.. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు, కాపు నేతలకు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయితే సంయమనం పాటించిన జగన్ అక్కడ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయారు.
 

loader