అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
అమరావతి: అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు వ్లే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగలేదన్నారు.
సోమవారం నాడు విజయవాడలో అగ్రి గోల్డ్ బాధితులకు మద్దతుగా బిజేపీ ప్రారంభించిన ఐదు రోజుల రిలే నిరహార దీక్షల్లో ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు మనుషులు అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ అవినీతి వల్లే బాధితులకు న్యాయం జరగడం లేదని ఆయన విమర్శించారు. 3 వేల కోట్ల విలువైన హాయ్‌ల్యాండ్‌ను మంత్రి లోకేష్ రూ. 270 కోట్లకు కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లోకేష్ అడిగిన ధరకు ఈ భూమిని ఇవ్వకపోవడంతో వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు.
అగ్రిగోల్డ్ యాజమాన్యం, టీడీపీ సర్కార్ కుమ్మకై 3 లక్షల అగ్రిగోల్డ్ బాధితులను ఇబ్బందిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. అసలు అగ్రిగోల్డ్ ఆస్తుల లెక్కలను ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. ఉద్దేశ్యపూర్వకంగానే అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను తగ్గించి చూపేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపసించారు.
సంబంధిత వార్తలు
