అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  ఈ నెల 27న మౌన దీక్ష చేయనున్నారు. బీజేపీ శ్రేణులతో పాటు కలిసి కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష చేస్తారు.

ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే శుక్రవారం నాడు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష చేయనున్నారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకిస్తోంది.

ఈ ప్రతిపాదనను బీజేపీ నిరసిస్తోంది. ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 27వ తేదీన జరగనుంది. జీఎన్ రావు కమిటీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ కేబినెట్ సమావేశంలో జీఎన్ రావు కమిటీతో పాటు  కేబినెట్ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.