Asianet News TeluguAsianet News Telugu

తండ్రి వైఎస్సార్ నిర్ణయాన్నే కాదని... రహస్య పాలనకు జగన్ శ్రీకారం: కన్నా ఆందోళన

గతంలో తండ్రి వైఎస్సార్ హయాంలో తీసుకువచ్చిన ఆన్ లైన్ జీవో విదానాన్ని మారుస్తూ ఆఫ్ లైన్ లో జీవోలను విడుదల చేసే విధానానికి జగన్ సర్కార్ శ్రీకారం చుట్టిందని బిజెపి నాయకులు కన్నా లక్ష్మీనాారాయణ మండిపడ్డారు.

kanna lakshminarayana serious on  cm jagan over GOs issued in   offline
Author
Guntur, First Published Aug 18, 2021, 2:55 PM IST

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో అధికారిక అవినీతి జరుగుతుందని బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గత 50 ఏళ్లలో ఇలాంటి అవినీతి ఎక్కడా చూడలేదన్నారు. ప్రజలకు డబ్బులు పంచుతున్నాం అనుకుంటే సరిపోదని... వాళ్ళు అన్ని గమనిస్తున్నారని వైసిపి ప్రభుత్వాన్ని కన్నా హెచ్చరించారు. 

''ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు. గతంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉండేది... ఇప్పుడు సిఐడి పటిష్టంగా ఉంది. పోలీస్ వ్యవస్థ ప్రతిపక్షాలను అనగదొక్కడనికే పని చేస్తోంది. ప్రతిపక్ష నేతల హౌస్ అరెస్ట్ లు పరిపాటిగా మారాయి.'' అని ఆందోళన వ్యక్తం చేశారు.

read more  జాగ్రత్త... జగన్ రెడ్డి కుటుంబ చరిత్ర అలాంటిది: ఐఎఎస్, ఐపిఎస్ లకు అచ్చెన్న హెచ్చరిక

''ఆంధ్ర ప్రదేశ్ కు క్యాపిటల్ ఎక్కడ అని చెప్పుకోలేని స్ధితిలో ప్రభుత్వం ఉంది. 2008 లో వైఎస్సార్ తెచ్చిన ఆన్ లైన్ జీవోల విధానాన్ని జగన్ జగన్ నిలిపివేశారు.   నడపాలని ప్రభుత్వం భావిస్తుంది'' అని కన్నా ఆరోపించారు.  

ఇటీవలే వైసిపి ప్రభుత్వం జీవోలను ఇకపై ఆన్ లైన్ లో పెట్టకూడదని నిర్ణయించింది. ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదని... ఇకపై విడుదల చేసే జీవోలను వెబ్ సైట్లలో ఉంచొద్దని అన్ని శాఖల కార్యదర్శులకు జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
 
 

Follow Us:
Download App:
  • android
  • ios