తిరుపతిలో కన్నాను అడ్డుకున్న పోలీసులు.. నిజాలు చెబుతున్నామని మాపై దాడులు..

kanna lakshminarayan fires on chandrababu naidu at tirupati
Highlights

నిజాలు చెబుతున్నామనే తమపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు

నిజాలు చెబుతున్నామనే తమపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు.

ప్రభుత్వ ఖర్చుతో నయవంచన దీక్షలు చేయడం ఆపాలని డిమాండ్ చేశారు.. మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌లో మెరిట్ కోటా నుంచి.. ఎస్సీ, బీసీలను తొలగించడం అన్యాయమన్నారు. మామిడి, టమోటా రైతులు నష్టపోవడానికి టీడీపీ నాయకులే కారణమని.. రైతుల ఆదాయం పెంచేందుకే కేంద్రప్రభుత్వం మద్ధతు ధర ప్రకటించిందని కన్నా స్పష్టం చేశారు. సుప్రీంలో అఫిడవిట్‌సై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రజలు వాటిని నమ్మవద్దంటూ లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.

కన్నాను అడ్డుకున్న పోలీసులు:
తిరుపతి పర్యటనలో ఉన్న కన్నా చేత స్థానిక అన్నారావు సర్కిల్‌ వద్ద పార్టీ జెండా ఎగురవేయించాలని నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని.. అనుమతి లేకుండా జెండా ఎగురవేయాలని చూస్తే అడ్డుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అక్కడ ఏఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
 

loader