కడపలో  స్టీల్‌ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టు రావడం చంద్రబాబుకు ఇష్టం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఏపీకి రావాల్సిన నిధులు కేంద్రం ఇస్తోందని అన్నారు. టీడీపీ అన్ని అంశాలపై రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని కులాలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు మోసం చేయడానికి ఇప్పుడు ఏ కులం లేదన్నారు. కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని...వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.