వైసీపీ నేత విజయ సాయి రెడ్డిలాగా.. చంద్రబాబు.. ప్రధాని మోదీకి పాదాభివందనం చేయలేదని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అక్షర క్రమంలో ముందు ఉన్నా.... ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని, నీతి ఆయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్ర సమస్యలన్నీ ఎత్తి చూపారని తెలిపారు.నీతి ఆయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్రం హామీలను విస్మరించిన తీరును ఎండగట్టారని, ఇతర రాష్ట్రాలు ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టేలా చేసిందన్నారు. 

కళ్లుండి చూడలేని అంధుడు సభ్యత, సంస్కారం, విజ్ఞత లేని వ్యక్తి జీవీఎల్‌ అని తెలిపారు. వైసీపీ, బీజేపీ ఒకే రకమైన విధానాన్ని అవలంబిస్తున్నారు. విజయసాయిరెడ్డిలా చంద్రబాబు పాదాభివందనం చేయలేదన్నారు. ప్రధాని పలకరింపునకు సంస్కారంగా మాత్రమే చంద్రబాబు వ్యవహరించారని చెప్పారు.