కమలాపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live
కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి, పుత్త చైతన్య రెడ్డి టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. వీరిలో విజయం ఎవరిది అనేది ఉత్కంఠ నెలకొంది.
కడప నగరానికి అత్యంత చేరువలో వుండే కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి విలక్షణ చరిత్ర వుంది. ఈ సెగ్మెంట్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు ఫ్యాక్షన్ రక్కసి జడలు విప్పింది. కడప జిల్లాలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కమలాపురం ఒక ఒకటి. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రెడ్డి సామాజిక వర్గానిదే అక్కడ ఆధిపత్యం. పార్టీ ఏదైనా సరే గెలిచేది రెడ్లే. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు, స్వతంత్ర అభ్యర్ధులు, ఇప్పుడు వైసీపీ నేతలను అక్కున చేర్చుకున్నారు. అంతేకాదు.. కమలాపురానికి ఓ సెంటిమెంట్ కూడా వుంది. ఇక్కడ వరుసగా రెండు సార్లు గెలిచిన వ్యక్తి మూడోసారి ఓడిపోతారనే వాదన కూడా వుంది. గత చరిత్ర దీనిని ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంది.
1985, 89లలో ఇక్కడ కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన ఎంవీ మైసూరా రెడ్డి.. 1994 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తర్వాత జీ వీరా శివారెడ్డి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి 2014లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే , సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అనుచరవర్గం భయపడుతోంది. కమలాపురంలో వైసీపీ బలంగా వున్నప్పటికీ.. సెంటిమెంట్ కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కమలాపురంలో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, స్వతంత్రులు రెండు సార్లు, కమ్యూనిస్టులు ఒకసారి గెలిచారు.
కమలాపురంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,00,452 మంది. వీరిలో పురుషులు 98,260 మంది.. మహిళలు 1,02,158 మంది. ఈ సెగ్మెంట్ పరిధలో పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, కమలాపురం, వల్లూర్, చెన్నూర్, వీరపునాయనిపల్లె మండలాలున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి రవీంద్రనాథ్ రెడ్డికి 88,482 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి పుత్తా నర్సింహారెడ్డికి 61,149 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 27,333 ఓట్ల తేడాతో కమలాపురంలో విజయం సాధించింది. 2014లో మాత్రం వైసీపీకి టీడీపీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఆ ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డికి 78,547 ఓట్లు.. పుత్తా నర్సింహారెడ్డికి 73,202 ఓట్లు పోలై.. 5,345 ఓట్ల తేడాతో వైసీపీ విజయం సాధించింది.
కమలాపురం శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 ..
వరుసగా రెండు సార్లు విజయం సాధించిన వైసీపీ 2024లోనూ ఇక్కడ గెలవాలని కసితో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారు. కమలాపురంలో తెలుగుదేశం పార్టీ గెలిచి 20 ఏళ్లు కావొస్తోంది. 2004లో చివరిసారిగా టీడీపీ జెండా ఇక్కడ రెపరెపలాడింది. వరుసగా మూడు సార్లు ఓడిపోయినప్పటికీ .. పుత్తా నర్సింహారెడ్డి కుటుంబానికే చంద్రబాబు టికెట్ కేటాయించారు. పుత్తా చైతన్య రెడ్డిని టీడీపీ నుంచి పోటీ చేశారు. మరి సెంటిమెంట్‌ని ఫలించి టీడీపీ గెలుస్తుందా? లేక సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి వైసీపీ గెలుస్తుందా అనేది ఈ సాయంత్రానికి తెలుస్తుంది.
- Andhra Pradesh Assembly Election Results 2024 Live Updates
- Chandrababu naidu
- Kamalapuram Assembly elections result
- Kamalapuram Assembly elections result 2024
- Kamalapuram Assembly elections result 2024 live
- Sharmila
- TDP
- Telugu Desam Party
- YSR Congress Party
- YSRCP
- congress
- janasena
- putta Chaitanya reddy
- ravindranadh reddy
- ys jagan