Asianet News TeluguAsianet News Telugu

సూర్యుని చుట్టూ భూమి, దాని చుట్టూ జగన్...కేంద్ర హెచ్చరికలు బేకాతరు: కళా వెంకట్రావు

కరోనా  కష్టకాలం విద్యుత్ చార్జీలు పెంచి ఏపి ప్రజలపై వైసిపి ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపిందని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు మండిపడ్డారు. 

kala  venkat rao serious on electricity charges hike in AP
Author
Guntur, First Published May 11, 2020, 11:23 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గుంటూరు: ప్రజల నడ్డి విరవడమే ద్వేయమన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యహరిసస్తోందని... లాక్ డౌన్ సమయంలో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేయడం దుర్మార్గమని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ లో ప్రజలకు అండగా ఉంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం చార్జీలు పెంచి ప్రజలను ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు.

''ఎన్నికలకు ముందు  జగన్, వైసీపీ నేతలు ఇల్లిల్లూ తిరిగి కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి రాగానే కరెంటు చార్జీలు పెంచి ప్రతి ఇంటిపై మోయలేని భారం మోపారు. ఇంకో సారి వైసీపీ నేతలు మాట తప్పం, మడమ తిప్పం అంటే ప్రజలు మడతేసి కొడతారు. మండుటెండలో ప్రజల మాడు పగిలేలా కరెంట్ బిల్లులు వేస్తున్నారు. రోహిణి కార్తెలో రోళ్ళు పగులతాయో లేదో తెలీదు గానీ కరెంటు బిల్లులు చూసి సామాన్య ప్రజల గుండెలు పగులుతున్నాయి'' అంటూ వైసిపి చర్యలపై సెటైర్లు విసిరారు. 

''రూ. 300 రావాల్సిన బిల్లు రూ. 3 వేలు వస్తోంది. పేదోడు సంపాదించిందంతా బిల్లుకే సరిపోనంత విద్యుత్ చార్జీలు పెంచారు. దీనికి  జగనన్న విద్యుత్ దీవెన పధకం అనే పేరు పెట్టుకోండి'' అని ఎద్దేవా చేశారు. 

''ఏదేమైనా మార్చి, ఏప్రిల్‌ నెలల సగటు క‌రెంటు వినియోగం ఆధారంగా గ్రూప్‌ టారిఫ్‌ నిర్ణయించి విద్యుత్‌శాఖ బిల్లులు వసూలు చేయటం ప్రజలకు ఇబ్బందిగా మారింది. సాధారణ దిగువ మరియు మధ్య తరగతి కుటుంబాలకి రెండు నెలలకు కలిపి 200 యూనిట్లు పైగా రీడింగ్ చూపడంతో నెలకు యూజర్ చార్జీలతో పాటు రూ. 100 కట్టినవాళ్లు నేడు రూ.600కు పైగా చెల్లించాల్సి వస్తోంది'' అని అన్నారు.

''ఇప్పుడు తీసిన బిల్లును రెండు నెలలు మొత్తం యూనిట్లు ను రెండుగా విడదీసి  స్లాబ్ రేట్లు తగ్గించి దిగువ, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవాలి గాని.. కరోనా కష్టాలతో, లాక్ డౌన్‌తో వల్ల ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై మరింత భారం మోపుతారా? మీటర్ రీడింగ్ తీయకుండా మీరు చేసిన తప్పులకు ప్రజలను శిక్షిస్తారా..?'' 
అంటూ మండిపడ్డారు. 

''రెండు నెలల విద్యుత్ వినియోగానికి ఒకేసారి బిల్లు విధించి ప్రజలపై భారం మోపడం దుర్మార్గం.  లాక్ డౌన్ సమయంలో ప్రమాదకర ధోరణి ప్రభుత్వం అమలుచేస్తోంది.ఏ నెలకు ఆ నెల విడివిడిగా బిల్లులు వేయాలి. పెంచిన బిల్లులను ప్రభుత్వం వెంటనే రద్దుచేయాలి'' అని వెంకట్రావు డిమాండ్ చేశారు. 

''తెదేపా హయాంలో ప్రజలపై ఒఖ్క పైసా కూడా భారం వేయలేదు. ఇప్పుడు ఎడమ చేత్తో రూపాయి ఇస్తూ కుడి చేత్తో వంద రూపాయలు లాక్కుంటున్నారు. ప్రభుత్వం వేస్తున్న భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జగన్ తన ఏడాది పాలనలోనే విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించి రాష్టాన్ని అప్రతిష్టలపాలు చేసారు'' అని మండిపడ్డారు. 

''విద్యుత్తు పీపీఏల రద్దు విషయంలో కోర్టులు,కేంద్రం, విదేశాల హెచ్చరికలు బేకాతరు చేసి పెట్టుబడులకు మోకాలొడ్డారు. ఇప్పుడు కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగి నట్టు ప్రతీకారం చుట్టూ జగన్ పరిపాలన పరిబ్రమిస్తుంది.  తానూ ఏది చేసినా చెల్లుబాటు అవుతుందన్న మూర్ఖత్వంతో జగన్  వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ ని  అంధకారం లోకి  నెడుతున్నారు'' అని విమర్శించారు. 

''రాష్ట్ర విభజన సమయంలో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు లోటు ఉండగా టీడీపీ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలానికే విద్యుత్ లోటు అధిగమించి మిగులు విద్యుత్ సాధించాం. చంద్రబాబు నాయుడు పాలనలో విద్యుత్ రంగానికి కేంద్రం నుంచి  అవార్డులు వస్తే జగన్ పాలనలో ప్రజల నుంచి చీవాట్లు వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం  విద్యుత్ చార్జీలు పెంచమని  అవసరం అయితే తగ్గిస్తామని చెప్పింది. ఈ ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంచమని చెప్పి ఆది కారంలోకి వచ్చి ఏడాదిలో  రెండు సార్లు విద్యుత్ చార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చింది సమాధానం చెప్పాలి'' అంటూ  వైసిపి ప్రభుత్వాన్ని నిలదీశారు. 

''మీ చేతకాని తనంతో ప్రజలు పై విద్యుత్ ధరలు పెంచి నడ్డివిరుస్తున్నారు. విద్యుత్ చార్జీల భారం ప్రభుత్వ చేతకానితనమే. ప్రభుత్వం వ్యస్థను సమర్ధవంతంగా నిర్వహిస్తే చార్జీలు పెంచాల్సిన అవసరం లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి విద్యుత్ వ్యవస్థను నాశనం చేయడంపైనే ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు'' వెంకట్రావు
 మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios