Asianet News TeluguAsianet News Telugu

ఎజెండా అదొక్కటే...లేదంటే శవాల దిబ్బలపై రాజ్యం ఏలాల్సిందే: ప్రభుత్వానికి కళా హెచ్చరిక

 రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాలిస్తే  పాలకులు మాత్రం  నీరో చక్రవర్తిని తలపిస్తూ వారి లక్ష్యాలకు  అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు.

kala venkat rao serious comments on corona outbreak in AP
Author
Guntur, First Published Jul 24, 2020, 11:45 AM IST

గుంటూరు: రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాలిస్తే  పాలకులు మాత్రం  నీరో చక్రవర్తిని తలపిస్తూ వారి లక్ష్యాలకు  అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్లనే ఇంతటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను పిబ్రవరిలోనే ప్రపంచ మఃహమ్మారిగా ప్రకటించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెల్లడించినా ప్రభుత్వాలు పట్టించుకోకుండా అరకొర చర్యలు చేపట్టి చేతులు దులుపుకోబట్టే నేడు పరిస్థితి చెయ్యి దాటిపోయిందని పేర్కొన్నారు. 

''వేల సంఖ్యలో కేసులు పెరిగిపోతూ మరణ మృదంగం మొగిస్తుంటే పాలకలకు కనిపించడం లేదా? కట్టడి చెయ్యాల్సిన భాధ్యత పాలకులకు లేదా? కరోనా మహమ్మారి అతివేగం గా వ్యాప్తి చెందుతుంటే వైధ్యరంగంలో గణనీయ మార్పులకు శ్రీకారం చుట్టామని...కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యలో దేశంలో ముందున్నామని గొప్పలు చెబుతున్నది ఏపీ ప్రభుత్వం. కానీ నిర్ధారణ పరీక్షలు వారం, పది రోజులవరకు ఫలితాలు వెల్లడించకపోతే చేసిన పరీక్షల వల్ల ప్రయోజనం ఏమిటి? టెస్టుల సంఖ్యను చూపించి తన భాద్యత నుండి తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం.టెస్టుల శాంపిల్స్ రిపోర్టులు ఎంత ఆలస్యం అయితే వైరస్ వ్యాప్తి అంత ఎక్కువగా వుంటుంది'' అని అన్నారు. 

''రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాలో కరోనా నియంత్రణ ప్రధాన మైనది కాదు. అందుకే కరోనా నియంత్రణ పై మొదటినుండి  వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. రోజురోజుకు కొత్త రికార్డులతో కరోనా తన పంజా విసురుతుంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా భాధితుల సంఖ్య  64,713  వేలకి చేరింది.  ఇప్పటివరకు  823  మంది ప్రాణాలు కోల్పోయ్యారు. కరోనా కేసులు 50  వేల మార్క్ దాటి జాతీయ స్థాయిలో అయిదవ స్థానానికి రాష్ర్టం చేరడం ఆందోళనకరంగా ఉంది'' అన్నారు. 

read more   దళిత బాలికపై గ్యాంగ్ రేప్: మహిళా కమిషన్ కు వంగలపూడి అనిత ఫిర్యాదు

''పాజిటీవ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగు తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. కానీ ప్రభుత్వ ఎజెండా అంతా సంకుచిత రాజకీయమే తప్ప ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత లేదు. ఆంధ్రప్రదేశ్ లో మార్చి 22 నాటికి 5 కేసులు నమోదుకాగా నేడు 58,668 వేలు నమోదు అయ్యాయి. డాక్టర్స్ సేవలు గుర్తించి వారికి సకల సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం నామమాత్ర సహాయం అందిస్తుంది. అదే కాకుండా సదుపాయాలు అడిగిన డాక్టర్లపై అక్రమకేసులు పెట్టి వేదించారు''  అని ఆరోపించారు. 

''వైద్యానికి ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తామన్నారు కానీ అది ఎక్కడా అమలుకు నోచుకోలేదు.  గ్రామగ్రామం తిరిగి, ఇల్లుఇల్లు తిరిగి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామన్నారు అది ఎక్కడా అమలుకాలేదు. ఒక్కొక్కరికి మూడు మాస్కులు అందిస్తామన్నారు అది జరగలేదు. కొన్ని చోట్ల  ఆక్సిజన్ సక్రమంగా  అందక కరోనా  భాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా కట్టడిపై  బడాయి తప్ప జగన్ ప్రభుత్వం చేసిందేమీలేదు'' అని ఎద్దేవా చేశారు. 

''నిత్యం వేలల్లో కేసులు, రోజుకు 50 నుండి 60 కి పైగా మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. పైగా మరణాల రేటు తక్కువగా వుందని చెప్పడానికి ఉత్సాహపడుతున్నారు. అది కూడా ప్రభుత్వ ఘనత కాదు. వైద్య, ఆరోగ్య, పారిశుద్య, పోలీసు సిబ్బంది అంకితభావం వల్ల సాధ్యమైంది'' అన్నారు. 

''కరోనా వైరస్ ప్రయివేటు హాస్పిటల్స్ కనక వర్షం కురిపిస్తుంది. ఈ విచ్చలవిడి దోపిడీని ప్రభుత్వం నియంత్రించడంలో నిర్లక్ష్యం వహిస్తుంది.పేదలు, మధ్య తరగతి ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రైవేటు హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్నారు. కానీ ఈ ప్రయివేటు హాస్పిటల్స్ బిల్లులు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ దందాకు అడ్డుకట్ట పడాలి అంటే ప్రభుత్వ పరంగా నిర్ధిష్ట చర్యలు వుండాలి. కానీ అవి లేవు'' అని మండిపడ్డారు.

''రాష్ట్రంలో కరోనా నివారణకు సరైన సదుపాయాలు,పరీక్షలు వుంటే కరోనా పాజిటీవ్ వచ్చిన అధికార పార్టీ నాయకులు పొరుగు రాష్ట్రంలోవైద్యం ఎందుకు చేయించుకొంటున్నారో ప్రభుత్వమే సమాదానం చెప్పాలి. దీన్ని బట్టే రాష్ర్టంలో  కోవిడ్ వైద్యశాలల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్దమవుతోంది. చంద్రబాబు పాలనలో విద్య, వైద్యం కోసం ఇతర రాష్ట్రాలనుంచి ఏపీకి వస్తే...నేడు ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లే పరిస్థితి కల్పించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్   సంకుచిత రాజకీయాలు మాని కరోనా కట్టడిపై బహుముఖ చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి. లేకుంటే శవాల దిబ్బలపై రాజ్యం ఏలాల్సి వస్తుందని గుర్తించాలి'' అని కళా వెంకట్రావు హెచ్చరించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios