Asianet News TeluguAsianet News Telugu

దళిత బాలికపై గ్యాంగ్ రేప్: మహిళా కమిషన్ కు వంగలపూడి అనిత ఫిర్యాదు

తూర్పు గోదావరి జిల్లాలో దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యాచారంపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సంఘటన వివరాలను అందించారు.

Vangalapudi Anitha complains about Dalit girls molestation incident
Author
Vijayawada, First Published Jul 24, 2020, 8:08 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: తూర్పు గోదావరి జిల్లాలో దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై, ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.   ఆంధ్రప్రదేశ్ లో మహిళల పై ముఖ్యంగా దళిత మహిళలపై జరుగుతున్న హింసాత్మక దాడులు అట్రాసిటీ లను చూస్తే హృదయం చలించిపోతుందని ఆమె అన్నారు. 

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి  మహిళలపై, దళితులపై దాడులు తీవ్రమయ్యాయని, మహిళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందుకు మినహాయింపు కాదని, 2019 అక్టోబర్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే సరళ అనే మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి ఇంటికి కి వెళ్లి ఆమెపై దాడి చేసి బెదిరించారని ఆమె అన్నారు..

ఇదే తరహాలో  2020 మార్చిలో చిత్తూరు జిల్లాలో స్థానిక వైసీపీ నాయకులు డాక్టర్ అనిత రాణి అనే సివిల్ సర్జన్ ను వేధింపులకు గురి చేశారని, ఇటువంటి సంఘటనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ప్రత్యేకించి మహిళలు చాలా భయాందోళన లలో జీవిస్తున్నారని అనిత అన్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇటీవల ఒక దళిత బాలికను బంధించి నాలుగు రోజులపాటు వరుసగా మానభంగం చేశారని ఆమె ఫిర్యాదు చేశారు.

Also Read: దళిత బాలిక కేసు: అక్కే ఆటోలో తీసుకుని వెళ్లి గ్యాంగ్ రేప్ చేయించింది

జూలై 12, 2020 (ఆదివారం)న  ఒక ఎస్సీ మాల కులానికి చెందిన మైనర్ దళిత బాలిక ను ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి మచ్చ అనిత అనే ఒక మహిళ ఆటో రిక్షాలో రాజమండ్రి కి తీసుకెళ్ళిందని, బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో తరువాత రోజు అనగా జూలై 13, 2020 (సోమవారం) బాలిక తల్లి వీరలక్ష్మి కూతురును  వెతకడానికి రాజమండ్రి వెళ్ళిందని, వెతికినా బాలిక జాడ తెలియకపోవడంతో అదే రోజున కోరుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మచ్చా అనిత అనే మహిళ పై అనుమానం వెలిబుచ్చిందని ఆమె వివరించారు.

జూలై 16, 2020 న ఒక గుర్తు తెలియని వ్యక్తి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మైనర్ బాలికను కోరుకొండ పోలీస్ స్టేషన్ దగ్గరలో వదిలి వెళ్ళాడని, తప్పిపోయిన మైనర్ బాలిక ఈమె నని గుర్తించిన పోలీసులు ఆ రోజు సాయంత్రం తల్లి వీరలక్ష్మి కి సమాచారం అందించారని అనిత వివరించారు.. 
పోలీస్ స్టేషన్ చేరుకున్న బాలిక తల్లి సమక్షంలో  'ఎక్కడికి వెళ్లావని' ప్రశ్నించిన పోలీసులకు 'మా అమ్మ కొడుతుందేమో అనే భయంతో ఇంటి నుంచి పారిపోయానని'  చెప్పిందని ఆమె అన్నారు. 

దీనితో తల్లీకూతుళ్లు ఇంటికి వెళ్లాలని తిరిగి అనగా జూలై 17, 2020 పోలీస్ స్టేషన్ కి రావాలని చెప్పి పంపించేశారని, జూలై 17 2020 (శుక్రవారం) న మైనర్ బాలిక, ఆమె తల్లి వీరలక్ష్మీతో పాటు అనుమానాస్పదరాలైనా మచ్చ అనితను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి పంపివేశారని చెప్పింది. బాలిక ఆరోగ్యం సరిగా లేదని గమనించిన తల్లి వీరలక్ష్మి అదే రోజు బాలికను రాజమండ్రి గవర్నమెంట్ ఆసుపత్రి లో చేర్పిందని అన్నారు. బాలికను ఆసుపత్రిలో చేర్పించిన తరువాత తల్లి వీరలక్ష్మి తన కూతురి పై జరిగిన అమానవీయ చర్యను మీడియాకు తెలిపిందని అన్నారు.

మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లోని అనేక దళిత సంఘాలు ఒకటై నిజ నిర్ధారణ కమిటీ ని ఏర్పాటు చేశారని, ఈ నిజ నిర్ధారణ కమిటీ బాలికను పరామర్శించినప్పుడు, తల్లి వీరలక్ష్మి పై కోపంతోనే ఇంటిలో నుంచి పారిపోయినట్లు చెప్పాలని పోలీసులు తనను బెదిరించిన సంగతి కమిటీ సభ్యులకు తెలియజేసిందని అన్నారు. తన ఇష్టానుసారమే ఇంట్లో నుంచి పారిపోయానని చెప్పాలని పోలీసులు బాలిక చేతులు విరిచి గోడకు అదిమి కొట్టి బెదిరించారని అనిత ఆరోపించారు. మొత్తం 12 మంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపింది. 

అంతేకాకుండా కొంతమంది పోలీసులు నిందితుల తో కలిసి ఈ చర్యకు ఒడిగట్టారన్న విషయం సుస్పష్టమని చెప్పింది. ఈ అమానవీయ దుశ్చర్యకు పాల్పడిన ఇద్దరు కోవిడ్ పాజిటివ్ లు ఉన్నారని చెప్పారు. బాధితురాలైన మైనర్ బాలిక కూడా కోవిడ్ పాజిటివ్ అని చెబుతున్నారని అన్నారు. దీనితో ఆ బాలికను కలవడానికి పరామర్శించడానికి ఎవరినీ అనుమతించడం లేదని అనిత ఆరోపించారు. 

ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఈ చర్యకు పాల్పడ్డ వారిపై జాతీయ మహిళా కమిషన్ వారు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై ముఖ్యంగా దళిత మహిళలపై జరుగుతున్న ఇటువంటి హింసాత్మక చర్యలు, అట్రాసిటీ లను దృష్టిలో ఉంచుకొని కమీషన్ వారు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అనిత విజ్ఢప్తి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios