Asianet News TeluguAsianet News Telugu

కాకినాడకు పాముల బెడద... 100ఏళ్లనాటి పాము లభ్యం

ఈ గ్రామాల్లో ఇప్పటి వరకు 100 పాములను పట్టుకున్నట్లు స్నేక్ లవర్,స్నేక్ క్యాచర్ జంపన గణేష్ శర్మ తెలిపారు. ఆ పాముల్లో బ్రౌన్ కోబ్రా, ర్యాట్ స్నేక్, రక్త పింజరి లాంటి పాములు ఉన్నట్లు అతను చెబుతున్నాడు. కాగా.. ఆ పాములను చంపడానికి మాత్రం తాను అంగీకరించలేదని అతను చెబుతున్నాడు. వాటిని జాగ్రత్తగా పట్టుకొని దూరంగా చెట్ల పొదల్లో వదిలిపెట్టినట్లు చెప్పాడు. పాములను మనం ఏం చేయకుంటే.. అవి కూడా మనల్ని ఏమీ చేయవని అతను చెప్పాడు.

Kakinada: With floodwaters come snakes, terrify people
Author
Hyderabad, First Published Sep 14, 2019, 11:17 AM IST

కొద్ది రోజుల క్రితం కాకినాడలో వరద ఉదృతి విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా గోదావరి ఉగ్రరూపంలో ఉభయగోదావరి జిల్లాలోని ఏజెన్సీ, లంకలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి..ప్రజలు అవస్థలు పడ్డారు. కాగా.. ఈ వరద సంగతి పక్కన పెడితే... కాకినాడ ప్రజలను పాముల భయం వెంటాడుతోంది.

వరదలకు ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతాలకు పాములు కుప్పలుతెప్పలుగా వచ్చి పడ్డాయి. మరీ ముఖ్యంగా దేవీపట్నం, కోనసీమ గ్రామాల్లో అయితే పాముల బెడద మరింత ఎక్కువగా పెరిగింది. ఇప్పటికే పలువురు గ్రామస్థులు పాము కాటుకి గురయ్యారు. పాములను పట్టుకోవాలని గ్రామస్థులను స్నేక్ క్యాచర్లకు సమాచారం అందిస్తున్నారు.

కాగా... ఈ గ్రామాల్లో ఇప్పటి వరకు 100 పాములను పట్టుకున్నట్లు స్నేక్ లవర్,స్నేక్ క్యాచర్ జంపన గణేష్ శర్మ తెలిపారు. ఆ పాముల్లో బ్రౌన్ కోబ్రా, ర్యాట్ స్నేక్, రక్త పింజరి లాంటి పాములు ఉన్నట్లు అతను చెబుతున్నాడు. కాగా.. ఆ పాములను చంపడానికి మాత్రం తాను అంగీకరించలేదని అతను చెబుతున్నాడు. వాటిని జాగ్రత్తగా పట్టుకొని దూరంగా చెట్ల పొదల్లో వదిలిపెట్టినట్లు చెప్పాడు. పాములను మనం ఏం చేయకుంటే.. అవి కూడా మనల్ని ఏమీ చేయవని అతను చెప్పాడు.

రెండు రోజుల క్రితం అమలాపురంలో బ్రౌన్ స్నేక్ కనిపించిందని.. దానికి దాదాపు 100 సంవత్సరాలు ఉంటాయని అతను చెప్పాడు. అంతేకాకుండా పాము కాటేసిన వారికి ఆయుర్వేద చికిత్స కూడా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios