తండ్రి ఇచ్చిన ఆస్తి వివరాలు  సోమిరెడ్డి చెప్పకపోతే, నేనే వెల్లడిస్తానంటున్న కాకాణి

 సోమిరెడ్డి ఆస్తుల వివాదం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా తయాారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజకీయాస్తులు ఎపుడు వివాదాస్పదమే. గెలక్కనే ఉండాలి. గెలికాక అంటుకుంటాయి.

 పార్టీ అధికారప్రతినిధి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి తలబొప్పికట్టే మరొక కొత్త సవాల్ ఈ రోజు ఎదురయింది.

సోమిరెడ్డి అక్రమ అస్తుల చిట్టా విప్పిన వైసిపి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ఈ రోజు ఈ వివాదాన్ని కొత్త మలుపు తిప్పారు.

‘ మీ తండ్రినుంచి నీకు సంక్రమించిన ఆస్తి ఎంత ?’ అని నిలదీశారు. వేయికోట్లమేర విదేశాలలో అస్తులు కొన్నట్లు వివరాలతో సహా కాకాణి బయటపెట్టి సోమిరెడ్డి ఇమేజ్ మీద బాగా దెబ్బతీశారు.సాక్షాలంటే ఆయన కొన్ని డాక్యమెంట్లు కూడా చూపించారు. ఇవన్నీ బోగస్ అంటూ సోమిరెడ్డి కేసులుపెట్టారు. ఉన్న ఆస్తిని పార్టీకోసం ప్రజల కోసం తగలబెట్టుకున్నానని వాపోయారు.

అయితే కాకాణి జంకడం లేదు. అంతేకాదు, కొంత వివరాలు వెల్లడిస్తానంటున్నాడు. వెనకంజ వేసేదే లేదంటున్నాడు. తండ్రి ఇచ్చిన ఆస్తి వాటా ఎంత? ఇంతవరకు ఎన్ని ఆస్తులు విక్రయించారు? ఇంత భారీగా పెట్టుబడులు ఎలా పెట్టావు ... వివరాలు వెల్లడించాలని కాకాణి అడుగుతున్కన్నారు.

ఒక వేళ తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తుల వివరాలు సోమిరెడ్డి వెల్లడించకపోతే తాను బయటపెడతానని గోవర్ధనరెడ్డి బాంబు పేల్చారు.సోమిరెడ్డి అక్రమాస్తులు ఒక్కక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

కుటుంబ పాస్ పోర్టులు బయటపెట్టడానికి ఇబ్బందేమిటని ఆయన ప్రశ్నించారు.

‘నేను బెదిరించానని సోమి రెడ్డి కేసులు పెట్టాడు. ఎక్కడ బెదిరించానో చెప్పాలి. సోమిరెడ్డిని రాజకీయంగా శాశ్వతంగా తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉంది. ఇది వైఎస్ ఆర్ కాంగ్రెస్ వెర్సెస్ తెలుగుదేశం కాదు. పార్టీలకు సంబందం లేదు. కాకాణికి , సోమిరెడ్డికి మధ్య సవాల్,’ అని అన్నారు.