Asianet News TeluguAsianet News Telugu

మోజు: ప్రియుడితో కలిసి.. భర్తను స్కార్పియోతో తొక్కించి హత్య

ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా చంపించింది. కడప జిల్లా దువ్వూరులో ప్రియుడితో కలిసి సాలిబాయి అనే మహిళ భర్తను స్కార్పియోతో తొక్కించి చంపించింది.

Kadapa: Wife kills husband with the help of lover
Author
Kadapa, First Published Nov 23, 2019, 11:23 AM IST

కడప: ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ భర్తను చంపించిన సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. వివాహేతర సంబంధంపై ప్రశ్నించినందుకు భర్తను ప్రియుడితోనే చంపించింది. కడప జిల్లాలోని దువ్వూరు పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసుకున్నారు. ఆ కేసును ఛేదించి మహిళతో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

డిఎస్పీ విజయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఆ కేసుకు సంబంధించిన విషయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. కర్నూలు జిల్లా మహానంది మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ముడావత్ తులసీ నాయక్ తో సాలిబాయికి 17 ఏళ్ల క్రితం వివాహమైంది. 

నాలుగేళ్ల క్రితం కడప జిల్లా టి. సుండుపల్లి మండలం మన్నంవారిపల్లెకు మూడె రెడ్డినాయక్ కు పెళ్లి సంబంధం కుర్చేందుకు సాలిబాయి వెళ్లింది. అయితే ఆమె అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంపై ఆమెను తులసీనాయక్ పలుమార్లు మందలించాడు. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాజని భావించిన  సాలిబాయి అతని హత్యకు రెడ్డి నాయక్ తో కలిసి కుట్ర పన్నింది. 

కుట్రలో భాగంగా రెడ్డి నాయక్ తన మిత్రులైన చక్రాయపేట మండలం ఎర్రగుడి తండాకు చెందిన వినోద్ కుమార్ నాయక్, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అయితేపల్లికి చెందిన విజయకుమార్, విజయనగరం జిల్లా మండల కేంద్రం గంట్యాడకు చెందిన మునగపాటి జగన్నాథ రాజులతో కలిసి తులసీ నాయక్ ను చంపేందుకు లక్ష రూపాయల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. పది వేల రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చారు.

రెడ్డి నాయక్ సాలిబాయికి రూ.10 వేలు బాకీ ఉన్నాడని. ఆ డబ్బును ఇస్తానని చెప్పి ఈ నెల 12వ తేదీన తులసీనాయక్ ను కడప జిల్లా దువ్వురు మండలం చింతకుంట గ్రామ శివారుల్లోకి పిలిపించారు. అక్కడ తులసీనాయక్ కు మద్యం తాగించారు. ఆ తర్వాత కుట్రలో భాగంగా తులసీనాయక్ ను మద్యం బాటిల్ తో కొట్టారు తులసీనాయక్ పారిపోవడానికి ప్రయత్నించాడు. 

దాంతో తమ వద్ద స్కార్పియో వాహనంతో అతన్ని తొక్కించి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని దువ్వూరు మండలం పెద్దజొన్నవరం మిట్ట దగ్గర కల్వర్టు పక్కన పడేశారు ఈ నెల 15వ తేదీన అక్కడ ఓ శవం ఉన్నట్లు దువ్వూరు పోలీసులకు సమాచారం అందింది. దాంతో శవాన్ని స్వాధీనం చేసుకుని అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు 

అయితే, తులసీనాయక్ భార్య కేసును తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నించింది. ఆ శవం తన భర్తదేనని, తమ గ్రామానికి చెందిన దనమ పెద్దపుల్లయ్య తన భర్త మరణానికి కారణమని సాలిబాయి పోలీసులతో చెప్పింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు సాలిబాయి ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. ఆమె తన ప్రియుడు రెడ్డినాయక్ తో మాట్లాడినట్లు తెలుసుకున్నారు. ప్రియుడితో కలిసి తులసీనాయక్ ను ఆమె హత్య చేసినట్లు నిర్ధారించుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios