ఈసీకి కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ లేఖ రాశారు. తన బదిలీ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపనలు రుజువు చేయాలని లేదా పిర్యాదు చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి లేఖ రాశారు. 

‘ముప్పై ఏళ్లుగా నిజాయతీతో బతుకుతున్నా.. ఇప్పుడు ఒక్కసారిగా నా బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యుల ముందు పరువు పోయింది.. నాపై ఆరోపణలు నిరూపించాలి లేదా నాపై తప్పుడు ఆరోపణలు చేసినవారి (విజయసాయిరెడ్డి)పై చర్యలు తీసుకోవాలి’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఏ తప్పూ చేయని తనను అకారణంగా బదిలీ చేశారని అందులో ఆవేదన వ్యక్తం చేశారు.