కడపలో పెన్నానదిలో చిక్కుకున్న ఐదుగురు: సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు

ఉమ్మడి కడప జిల్లాలోని పెన్నా నదిలో  ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. ఈ ఐదుగురిని కాపాడేందుకు  రెస్క్యూ సిబ్బంది  ప్రయత్నిస్తున్నారు.

Kadapa police Tries To Rescue Five Stuck in Penna River at Kanchannagar Palle

కడప: ఉమ్మడి కడప జిల్లాలోని పెన్నా నదిలో ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. వీరిని  రక్షించేందుకు గాను పోలీసులు  రంగంలోకి దిగారు.కడప జిల్లాలోని కమలాపురం మండలం కంచన్నగారిపల్లె వద్ద పెన్నా నదిలో ఐదుగురు చిక్కుకున్నారు.  వరద నీటిో చిక్కుకున్న వారిని కాపాడేందుకు పోలీసులు బోట్లతో రంగంలోకి దిగారు.

నాలుగైదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమలోని అనంతపురం, కర్నూల్, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు నదులకు వరద పోటెతత్తింది.  రాయలసీమ జిల్లాల్లోని పలు చెరువులు, కుంటలు,వాగులు, వంకలు నీటితో కలకలలాడుతున్నాయి. అనంతపురం పట్టణంలోని  సుమారు 15 కాలనీలు నీటిలో మునిగాయి.  ముంపు బాధిత ప్రాంతాలకు అనంతపురంలో  పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనంతపురం శివారు కాలనీలకు వరద ముంపు ఉందని  అధికారులు హెచ్చరించారు. ఇంకా రెండు రోజులు వర్షం ఉందని  అధికారులు  హెచ్చరించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని కూడా  అధికారులు సూచించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios