తాడిపత్రిలో తల్లికి పరామర్శ: అంబులెన్స్‌లోనే హైద్రాబాద్ కు అవినాష్ రెడ్డి

అస్వస్థతగా ఉన్న  తల్లి వైఎస్ లక్ష్మిని  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాడిపత్రిలో  కలిశారు. తల్లి వస్తున్న అంబులెన్స్ లోనే  వైఎస్ అవినాష్ రెడ్డి హైద్రాబాద్ కు బయలుదేరారు. 

Kadapa MP YS Avinash Reddy Returned To Hyderabad with mother From Tadipatri  in Ambulance lns

హైదరాబాద్: అస్వస్థతకు  గురైన  తల్లి లక్ష్మిని తీసుకొని  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైద్రాబాద్ కు  శుక్రవారంనాడు మధ్యాహ్నం  బయలుదేరారు.  తల్లి అస్వస్థతకు గురైందనే విషయం  తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ఇవాళ  ఉదయం సీబీఐ విచారణకు  హాజరు కాకుండా  పులివెందులకు  బయలుదేరారు.  పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో  వైఎస్ లక్ష్మికి  చికిత్స  నిర్వహించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను  హైద్రాబాద్ కు తరలించారు.

అయితే  పులివెందులకు వెళ్తున్న  అవినాష్ రెడ్డికి  తాడిపత్రి వద్దే  తల్లిని తీసుకువస్తున్న అంబులెన్స్ ఎదురైంది.  అంబులెన్స్ లో  ఉన్న తల్లిని  వైఎస్ అవినాష్  రెడ్డి  పరామర్శించారు.  తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అదే అంబులెన్స్ లో  వైఎస్ అవినాష్ రెడ్డి  హైద్రాబాద్ కు బయలుదేరారు.ఈ విషయం తెలుసుకున్న  సీబీఐ అధికారులు  ఆలంపూర్ నుండి  హైద్రాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారని సమాచారం.

also read:అస్వస్థత: మెరుగైన చికిత్సకు హైద్రాబాద్ కు వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి తరలింపు

ఇవాళ  ఉదయం  వైఎస్ లక్ష్మి అస్వస్థతకు గురయ్యారు.  పులివెందులలోని  ఆసుపత్రిలోనే ఆమెను చేర్పించారు.  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో  వైఎస్ అవినాష్ రెడ్డి  ఇవాళ  సీబీఐ విచారణకు  హాజరు కావాల్సి ఉంది. సీబీఐ విచారణకు  బయలుదేరిన  సమయంలో  తల్లికి అనారోగ్యం గురించి వైఎస్ అవినాష్ రెడ్డికి సమాచారం  అందింది.  

దీంతో  వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు  హజరు కాకుండానే  పులివెందులకు బయలుదేరారు. తల్లికి అనారోగ్యం కారణంగా  విచారణకు హాజరు కాలేని  విషయాన్ని  వైఎస్ అవినాష్ రెడ్డి తన లాయర్ల ద్వారా సీబీఐ అధికారులకు సమాచారం  ఇచ్చారు.మరో తేదీన   సీబీఐ విచారణకు సమయం ఇవ్వాలని  అవినాష్ రెడ్డి లాయర్లు సీబీఐని కోరారు. అయితే  ఈ విషయమై సీబీఐ అధికారులు    ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే   సర్వత్రా ఉత్కంఠ  నెలకొంది.2019 మార్చి  14వ తేదీన  హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కేసులో  వైఎస్ అవినాష్ రెడ్డిని  సీబీఐ అధికారులు  ఇవాళ  విచారించనున్నారు.
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios