కర్నూల్ విశ్వభారతి నుండి డిశ్చార్జ్: హైద్రాబాద్ ఎఐజీ ఆసుపత్రికి వైఎస్ శ్రీలక్ష్మి తరలింపు

కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి  వైఎస్ శ్రీలక్ష్మిని   హైద్రాబాద్  గచ్చిబౌలి ఎఐజీ  ఆసుపత్రిలో  చేర్పించారు.  ఇవాళ  ఉదయం  కర్నూల్ విశ్వభారతి  ఆసుపత్రి నుండి  వైఎస్  శ్రీలక్ష్మి  డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.

Kadapa MP YS Avinash Reddy mother Admitted in Hyderabad Gachibowli AIG Hospital lns


హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  తల్లి  వైఎస్ శ్రీలక్ష్మిని  హైద్రాబాద్  గచ్చిబౌలిలోని  ఎఐజీ  ఆసుపత్రిో  చేర్పించారు. ఇుక్రవారంనాడు  ఉదయం  కర్నూల్  విశ్వభారతి  ఆసుపత్రి  నుండి   వైఎస్ శ్రీలక్ష్మి  డిశ్చార్జ్ అయ్యారు. 

మెరుగైన  చికిత్స కోసం  వైఎస్ శ్రీలక్ష్మిని హైద్రాబాద్ గచ్చిబౌలిలోని ఎఐజీ  ఆసుపత్రికి తరలించారు.   ఈ నెల  19వ తేదీన  వైఎస్  శ్రీలక్ష్మి  అస్వస్థతకు గురయ్యారు. దీంతో  ఆమెకు  పులివెందులలోని  దినేష్  ఆసుపత్రిలో  చికిత్స అందించారు.  అనంతరం కర్నూల్ లోని   విశ్వభారతి  ఆసుపత్రిలో  చేర్పించారు.  ఇవాళ  ఉదయం వరకు  విశ్వభారతి ఆసుపత్రిలోనే  వైఎస్ అవినాష్ రెడ్డి  తల్లికి చికిత్స అందించారు.

also read:కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రి నుండి వైఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్: హైద్రాబాద్ కు తరలింపు

  వైఎస్ శ్రీలక్ష్మి ఆరోగ్యం  మెరుగు పడినట్టుగా విశ్వభారతి  ఆసుపత్రి వైద్యులు  ఇవాళ హెల్త్ బులెటిన్ విడుదల  చేశారు.  అయితే గుండెకు సంబంధమైన  చికిత్స అవసరమని  వైద్యులు సూచించారు. మెరుగైన చికిత్స హైద్రాబాద్ లోని ఎఐజీ ఆసుపత్రికి ఆమెను తరలించారుహైద్రాబాద్ గచ్చిబౌలి  ఎఐజీ  ఆసుపత్రికి  చెందిన  కార్డిలయాజిస్ట్  డాక్టర్  ప్రసాద్ రెడ్డి  నేతృత్వంలోని  వైద్యుల బృందం  వైఎస్ శ్రీలక్ష్మికి  చికిత్స అందిస్తున్నారు. 

కర్నూల్  విశ్వభారతి ఆసుపత్రి నుండి తల్లితో  కలిసి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ఎఐజీ ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలోనే  వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఈ నెల  19వ తేదీ నుండి  ఆసుపత్రిలోనే   ఉంటూ  తల్లి చికిత్స  విషయమై   ఎప్పటికప్పుడు  వైఎస్ అవినాష్ రెడ్డి తెలుసుకుంటున్నారు.   గతంతో పోలిస్తే  తన తల్లి ఆరోగ్యం మెరుగుపడిందని   వైఎస్ అవినాష్ రెడ్డి  చెప్పారు. కర్నూల్ విశ్వభారతి  ఆసుపత్రి వద్ద  వైఎస్ అవినాష్ రెడ్డి ఈ విషయం చెప్పారు. 

ఈ నెల  19వ తేదీన  సీబీఐ విచారణకు  హాజరయ్యే సమయంలో   తల్లి  అస్వస్థతకు గురైన  విషయం తెలుసుకుని  పులివెందులకు వెళ్లారు వైఎస్ అవినాష్ రెడ్డి,. అయితే  పులివెందుల నుండి   మెగరుగైన  వైద్య చికిత్స  కోసం  హైద్రాబాద్ కు   వైఎస్  శ్రీలక్ష్మిని తరలించారు. మార్గమధ్యలోని  తాడిపత్రి సమీపంలో  తల్లిని తరలిస్తున్న అంబులెన్స్  వైఎస్ అవినాష్ రెడ్డికి ఎదురైంది.  అదే అంబులెన్స్ లో వైఎస్ అవినాష్ రెడ్డి  కర్నూల్  విశ్వభారతి  ఆసుపత్రికి  తల్లి  వైఎస్ శ్రీలక్ష్మిని  తీసుకువచ్చారు.
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios