తల్లికి అనారోగ్యం: సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దూరం
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులకు బయలుదేరారు. తల్లి అనారోగ్యం కారణంగా పులివెందుల వైపునకు వైఎస్ అవినాష్ రెడ్డి బయలుదేరారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దూరమయ్యారు. తల్లి అనారోగ్య కారణాలతో శుక్రవారంనాడు హైద్రాబాద్ నుండి పులివెందుల కు బయలుదేరారు వైఎస్ అవినాష్ రెడ్డి. ఇవాళ సీబీఐ విచారణకు వెళ్లాల్సి ఉంది. కానీ తల్లి అనారోగ్యం కారణంగా వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు వెళ్లకుండా పులివెందులకు బయలుదేరారు.
హైద్రాబాద్ లోని తన నివాసం నుండి ఇవాళ ఉదయం 10:20 గంటల సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి బయలుదేరారు. ఇంటికి కొద్ది దూరం వెళ్లిన తర్వాత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఫోన్ వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పులివెందులలోని తన తల్లికి అనారోగ్యంగా ఉందని ఫోన్ లో సమాచారం అందింది. దీంతో సీబీఐ విచారణకు వెళ్లకుండా వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులకు బయలుదేరారు. తన తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు రాలేదని సీబీఐకి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లేఖను పంపారు. అయితే ఈ విషయమై సీబీఐ అధికారులు ఎలా స్పందిస్తారనేది చూడాలి.
తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు దూరంగా ఉన్నారు. ఈ నెల 16వ తేదీన కూడా సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి దూరంగా ఉన్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున విచారణకు రాలేనని వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ పంపారు. దీంతో ఈ నెల 16న మధ్యాహ్నం మరోసారి అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. ఇవాళ విచారణకు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు పంపారు. తల్లికి అనారోగ్యమని సీబీఐ విచారణకు వెళ్లకుండా పులివెందులకు వైఎస్ అవినాష్ రెడ్డి బయలుదేరారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు రాలేమని సమాచారం ఇవ్వడంతో హైద్రాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో ఉన్నవిచారణ అధికారి వికాస్ సింగ్ నేతత్వంలోని సీబీఐ బృందం కారులో కార్యాలయం నుండి బయటకు వెళ్లిపోయారు.
also read:పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు: డ్రైవర్ కు నోటీసుల అందజేత
విచారణకు రాకుండా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పంపిన లేఖపై సీబీఐ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారించేందుకు కడప జిల్లాలోనే మూడు సీబీఐ బృందాలున్నాయి.