పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు: డ్రైవర్ కు నోటీసుల అందజేత

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  నివాసంలో  సీబీఐ అధికారులు ఇవాళ   నోటీసులు అందించారు.  వైఎస్ భాస్కర్ రెడ్డి  డ్రైవర్ కు  నోటీసులిచ్చారు సీబీఐ అధికారులు.

CBI Serves  Notices  To  Kadapa  MP  YS Avinash  Reddy  Residence  lns

కడప: పులివెందులలోని  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ఇంటికి  మంగళవారంనాడు  సీబీఐ అధికారులు  చేరుకున్నారు.  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి  వైఎస్ భాస్కర్ రెడ్డి డ్రైవర్ కు  సీబీఐ అధికారులు  నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు.  మాజీ మంత్రి  వైఎస్  వివేకానందరెడ్డి హత్య కేసులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇవాళ  విచారణకు  రావాలని  సీబీఐ  నిన్న  నోటీసులు  జారీ చేసింది.  అయితే  తనకు ముందుగానే  నిర్ణయించిన షెుడ్యూల్ కారణంగా  తాను  ఇవాళ  విచారణకు  రాలేనని  వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారుు.  నాలుగు రోజుల తర్వాత విచారణకు  వస్తానని  వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి రాసిన లేఖలో  పేర్కొన్నారు.  దీంతో  ఈ నెల  19న విచారణకు  రావాలని  వైఎస్ అవినాష్ రెడ్డికి  సీబీఐ మరోసారి  నోటీసులు పంపింది.  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి  సీబీఐ అధికారులు  వాట్సాప్ లో  నోటీసులు పంపారు.  ఇవే నోటీసులను   వైఎస్ భాస్కర్ రెడ్డి డ్రైవర్ కు  అందించారు సీబీఐ అధికారులు.

 ఇవాళ  ఉదయం  పదిన్నర గంటలకు  హైద్రాబాద్ నుండి  వైఎస్ అవినాష్ రెడ్డి  కడపకు  బయలుదేరారు. పులివెందులకు  వైఎస్ అవినాష్ రెడ్డి  వచ్చేలోపుగానే  సీబీఐ అధికారులు   నోటీసులు  ఇచ్చి వెళ్లిపోయారు.మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డిని  2019 మార్చి  14న  హత్య  చేశారు.ఈ  హత్య కేసును  సీబీఐ విచారిస్తుంది.  ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు  ఈ కేసును సీబీఐ విచారిస్తుంది. 

also read:సీబీఐకి లేఖ: కడపకు వైఎస్ అవినాష్ రెడ్డి

ఈ హత్య కేసును ఈ ఏడాది జూన్  30వ తేదీ లోపుగా  విచారణ  పూర్తి చేయాలని  సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.  గతంలో  ఇదే  కేసును  సిట్ విచారించింది.  చంద్రబాబు  సీఎంగా  ఉన్న సమయంలో  సిట్  విచారణ  నిర్వహించింది. మరో వైపు వైఎస్ జగన్  సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  ఏర్పాటు  చేసిన సిట్  కూడా  ఈ హత్య  కేసును విచారించింది.   వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  సీబీఐ అధికారులు  ఇప్పటికే  ఏడుగురిని అరెస్ట్  చేశారు.   ఈ కేసులో  ఏ  4 గా  దస్తగిరి  సీబీఐకి అఫ్రూవర్ గా మారాడు. దస్తగిరి  ఇచ్చిన   వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు  కోర్టకు సమర్పించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios