టిడిపిలో మైనారిటి నేత రాజీనామా..చంద్రబాబుకు షాక్

Kadapa minority predident jolts chandrababu on resignation
Highlights

చంద్రబాబునాయుడుపై టిడిపిలోని మైనారిటీ సెల్ నేతలు తీవ్రంగా మండిపోతున్నారు.

చంద్రబాబునాయుడుపై టిడిపిలోని మైనారిటీ సెల్ నేతలు తీవ్రంగా మండిపోతున్నారు. దాదాపు పాతికేళ్ళుగా ఉన్న తమకు కాదని మొన్ననే వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన జలీల్ ఖాన్ కు వక్ఫ్ బోర్డు ఛైర్మన్  పదవి కట్టబెట్టటాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు.

జలీల్ ఖాన్ నియామకానికి నిరసనగా కడజ జిల్లా తెలుగుదేశంపార్టీ మైనారిటీ అమీర్ బాబు రాజీనామా చేశారు. అయితే అమీర్ ను చంద్రబాబు బోర్డులో డైరెక్టర్ గా నియమించారు.  25 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ ని నమ్ముకుని ఉంటే వక్స్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వకుండా మోసం చేశారని తీవ్రంగా మండిపడ్డారు అమీర్.

జలీల్ ఖాన్ వక్స్ బోర్డు చైర్మన్ గా ఇతర సభ్యులు డైరెక్టర్ ల గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సోమవారమే అమీర్ రాజీనామాపత్రం ఇచ్చి వెళ్ళి పోవటంతో అందరూ ఖంగుతిన్నారు. తర్వాత చంద్రబాబును కలసి తన అసంతృప్తి ని తెలియజేయటం గమానార్హం. సిఎం ఎంత వారిస్తున్నా వినకుండా అమీర్ అక్కడ నుండి వెళ్ళిపోయారు. దాంతోనే మైనారిటీల్లో చంద్రబాబుపై ఏ స్ధాయిలో అసంతృప్తి ఉందో అర్ధమవుతోంది.

 

loader