అనంతపురం: టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రబాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను కడప జైల్లో కలిసేందుకు అధికారులు లోకేష్ కు అనుమతి ఇవ్వలేదు.

నకిలీ పత్రాలతో వాహనాలను విక్రయించారనే కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని శనివారం నాడు అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం కడప జైలుకు తరలించారు. అనంతపురం జైలు రెడ్ జోన్ పరిధిలో ఉంది. దీంతో అనంతపురం జైలు అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డిని తీసుకోలేదు. దీంతో వారిని కడప జైలుకు తరలించారు. 

also read:అనంత జైలు నో: కడప సెంట్రల్ జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి

జేసీ ప్రభాకర్ రెడ్డితో ముఖాఖత్ కోసం లోకేష్ ఇవాళ కడపకు చేరుకొన్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో జైల్లో ఉన్న జేసీ ప్రబాకర్ రెడ్డిని కలిసేందుకు లోకేష్ కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో జేసీ కుటుంబసభ్యులను నారా లోకేష్  ఈ నెల 15వ తేదీన పరామర్శించనున్నారు.

నకిలీ పత్రాలతో వాహనాలను విక్రయించారనే ఆరోపణలపై జేసీ కుటుంబసభ్యులు ఖండించారు. నకిలీ పత్రాలతో వాహనాలను తమకు విక్రయించారని అస్మిత్ రెడ్డి నాగాలాండ్ డీజీపీకి ఫిర్యాదు చేసినట్టుగా జేసీ పవన్ కుమార్ రెడ్డి శనివారం నాడు మీడియాకు వివరించారు.తమపై ఉద్దేశ్యపూర్వకంగానే కేసులు పెట్టారని జేసీ దివాకర్ రెడ్డి కుటుంబసభ్యులు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.