విశాఖపట్నం జిల్లాలోని జైల్ రోడ్డు వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ముందు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మత ప్రభోదకుడు కేఏపాల్ నానా హంగామా చేశారు. తన సొసైటీ పేరుతో ఫ్రీజ్ అయిన అకౌంట్లో డబ్బులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. 

సొసైటీకి తానే అధ్యక్షుని సొసైటీ తనదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని బ్యాంకు అధికారులకు పాల్ చెప్పారు. హాయ్ అకౌంట్‌కు సంబంధించి కోర్టు స్టేటస్కో ఉందని ఆయన చెబుతున్నారు. అయితే "మీకు డబ్బులు ఇవ్వాలంటే మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలి.. ఇప్పటి వరకూ మీకు డబ్బులివ్వాలని ఆదేశాలు రాలేదు కాబట్టి ఇచ్చే ప్రసక్తే లేదు" అని బ్యాంకు అధికారులు పాల్‌కు స్పష్టం చేశారు.

అధికారులు చెప్పినా వినకుండా.. కాసేపు వారితో వాగ్వాదానికి దిగారు.. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో.. అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.