ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కి పర్సనల్ అసిస్టెంట్ గా ఆయన అభిమానిని నియమించారు. జగన్  ఇటీవల సీఎంగా  ప్రమాణస్వీకారం చేపట్టిన సంగతి తెలిసిందే. 

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కి పర్సనల్ అసిస్టెంట్ గా ఆయన అభిమానిని నియమించారు. జగన్ ఇటీవల సీఎంగా ప్రమాణస్వీకారం చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పీఏగా కె.నాగేశ్వరరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

కడప జిల్లా కమలాపురానికి చెందిన నాగేశ్వరరెడ్డి(కేఎన్‌ఆర్‌) వివిధ పత్రికల్లో పనిచేశారు. 2008 నుంచి జగన్‌ వెన్నంటే ఉన్నారు. ముఖ్యంగా ప్రజాసంకల్ప పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. వివిధవర్గాలకు చెందిన నేతలతో జగన్‌ సమావేశాలు నిర్వహించడంలో కీ రోల్‌గా వ్యవహరించినట్లు చెబుతారు. 

వైజాగ్‌ విమానాశ్రయంలో జగన్‌పై దాడి జరిగిన సమయంలోనూ ఆయన పక్కనే ఉన్నారు. కాగా, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా ఇదే ఊరికి చెందిన డి.రవిశేఖర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.