ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణం

ఏపీ హైకోర్టు చీప్ జస్టిస్ గా ప్రశాంత్ కుమార్ మిశ్రా బుధవారం నాడు ప్రమాణం చేశారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ప్రమాణం చేయించారు.విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Justice Prashant Kumar Mishra sworn in as chief Justice of AP High Court

అమరావతి: ఆంధ్రప్రదేశ్  హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా బుధవారం నాడు ప్రమాణం చేశారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ Prashant Kumar Mishraతో ప్రమాణం చేయించారు.ఏపీ సీఎం ys jagan, పలువురు మంత్రులు, న్యాయమూర్తులు  మిశ్రా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.

also read:తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు: ఏపీకి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. టీఎస్‌కు సతీశ్ చంద్ర

cji nv ramana నేతృత్వంలోని కొలిజియం దేశంలోని పలు  రాష్ట్రాల చీఫ్ జస్టిస్ ల బదిలీలకు ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో సిఫారసు చేసింది. ఈ బదిలీల్లో మిశ్రాను ఏపీకి బదిలీ చేశారు.విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1964 ఆగష్టు 29వ తేదీన ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో రాయ్‌ఘడ్ లో జస్టిస్ మిశ్రా జన్మించారు. Justice Prashant Kumar Mishra sworn in as chief Justice of AP High Court

గురుఘసీదాస్ యూనివర్శిటీ నుండి బీఎస్సీ, ఎల్ఎల్‌బీని ఆయన పూర్తి చేశారు.1987 సెప్టెంబర్ 4న న్యాయవాదిగా ప్రశాంత్ కుమార్  మిశ్రా తన పేరును నమోదు చేసుకొన్నారు.రాయ్‌ఘడ్ జిల్లా కోర్టుతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ కోర్టుల్లో న్యాయవాదిగా ఆయన ప్రాక్టీస్ చేశారు.2005 జనవరి మాసంలో ఆయనకు సీనియర్ న్యాయవాది హోదా దక్కింది. ఆ తర్వాత ఆయన ఛత్తీస్‌ఘడ్ బార్ కౌన్సిల్ ఛైర్మెన్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు.హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీలో సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు.

2004 జూన్ 26 నుండి 2007 ఆగష్టు 31 వరకు ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జరనల్ కూడ పనిచేశారు. 2009 డిసెంబర్ 10న ఛత్తీస్‌ఘడ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ జస్టిస్ గా బదిలీ అయ్యారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios