న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ హత్య ఘటనపై నిండు లోక్ సభలో ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీ వంగా గీత. మహిళలను గౌరవించకపోయినా పర్లేదు గానీ చంపొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

లోక్ సభలో జీరో అవర్ లో దిశఘటనపై సభలో ప్రస్తావించారు. దిశను అత్యంత కృరంగా చంపేశారంటూ వంగా గీత ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఈ ఘటనను ఖండించాలన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడాలంటేనే భక్ష్పడేలా చట్టం తీసుకురావాలని ఆమె సభలో విజ్ఞప్తి చేశారు. 

మహిళలు బయటికి వెళ్తే ఇంటికి క్షేమంగా తతిరిగి వస్తారో రారో తెలియని పరిస్థితి దేశంలో నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  దిశ ఘటనలో నిందితులను బహిరంగంగా ఉరితియ్యాలని డిమాండ్ చేశారు. అందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణ సైతం చేయాలని సూచించారు. 

నిర్భయ ఘటన తర్వాత జరిగిన ఈ ఘటన అందర్నీ కలచివేసిందన్నారు. నలుగురు అత్యంత కృరంగా ప్రవర్తించి ఒక వైద్యురాలిని హతమార్చడం బాధాకరమన్నారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో భారతమాత తలెత్తుకునేలా చేశారని ఆమె అభిప్రాయపడ్డారు. 

ఇకపోతే దిశ ఘటనలో కూడా అందరూ గౌరవించేలా నిందితులను ఉరితియ్యాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుత కాలంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళలు బయటకు వెళ్లలేని దుస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మహిళలను లోపలపెట్టుకుని దాచుకునే పరిస్థితి దాపురిస్తుందన్నారు. 

మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారన్న నానుడి ఉందని దాన్ని పాటించకపోయినా పర్లేదు అన్నారు. తమను పూజించనవసరం లేదని, తమను గౌరవించాల్సిన అవసరం కూడా లేదన్నారు. తమను తమలా బతకనివ్వాలని, చంపొద్దంటూ వైసీపీ ఎంపీ వంగా గీత భావోద్వేగానికి గురయ్యారు. 

ఈ ఘటనతోనైనా కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు మేల్కొనాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మద్యం, డ్రగ్స్ విచ్చలవిడిగా లభ్యం కావడంతోనే ఈ దారుణాలు జరుగుతున్నాయని వాటిని ముందుగా అరికట్టేందుకు చట్టాలు తీసుకురావాలని కోరారు ఎంపీ వంగా గీత. 
 

ఇకపోతే బుధవారం సాయంత్రం దిశని నలుగురు నిందితులు అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. తొడుపల్లి దగ్గర దిశ స్కూటీ పార్క్ చేయడం చూసిన లారీ డ్రైవర్ మహ్మాద్ పాషా ఉద్దేశపూర్వకంగా ఆమె స్కూటీ పంక్చర్ అయ్యిందని కుట్ర పన్నారు. 

కేసులో ఏ3గా ఉన్న జొల్లు నవీన్ స్కూటీ బ్యాక్ టైర్ లో గాలి తీసేశారు. గచ్చిబౌలి నుంచి దిశ తొండుపల్లి వద్దకు రాగానే బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని నమ్మించారు. పంక్చర్ వేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసింది. పంక్చర్ వేయిస్తామని తీసుకెళ్లిన వారు గాలి కొట్టించి తిరిగి ఇచ్చేశారు.

అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అత్యాచార సమయంలో యువతి కేకలు వేయడంతో నోరు మూయడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. అనంతరం చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర కిరోసిన్ పోసి నిప్పంటించి దహనం చేశారు. 

దిశ హత్య కేసులో డ్రైవర్‌ ఏ1మహ్మద్ ఆరిఫ్, ఏ2 క్లీనర్‌ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్‌ (23), ఏ4 క్లీనర్‌ చెన్న కేశవులు (లారీ డ్రైవర్‌)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు స్పష్టటం చేశారు. తెలిపారు. వైద్యురాలి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. 

ఇకపోతే నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వీలైనంత త్వరలో కేసు విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.