Asianet News TeluguAsianet News Telugu

ఓపీ సేవల బహిష్కరణ: నేడు జూనియర్ డాక్టర్లతో ఏపీ ప్రభుత్వం చర్చలు

జూనియర్ డాక్టర్లు సమ్మెకు సిద్దమయ్యారు. ఇవాళ్టి నుండి ఓపీ సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు.  ఐదు డిమాండ్లను జూడాలు ప్రభుత్వం ముందుంచారు. 
 

junior doctors boycott duties from june 9 in Andhra pradesh lns
Author
Guntur, First Published Jun 9, 2021, 9:19 AM IST

అమరావతి: జూనియర్ డాక్టర్లు సమ్మెకు సిద్దమయ్యారు. ఇవాళ్టి నుండి ఓపీ సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు.  ఐదు డిమాండ్లను జూడాలు ప్రభుత్వం ముందుంచారు. సీనియర్ రెసిడెంట్ల స్టైఫండ్  పెంపెను మాత్రమే ప్రభుత్వం అమలు చేసింది.  కొవిడ్‌ సమయంలో వైద్య సేవలు అందిస్తున్న జూనియర్‌ వైద్యులకు ఇన్సెంటివ్స్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు నష్ట పరిహారం, హెల్త్‌ఇన్సూరెన్స్‌, ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులకు భద్రత, స్టయిపెండ్‌ నుంచి టీడీఎస్‌ కోత లేకుండా చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం జూడాలు ఇవాళ్టి నుండి ఓపీ సేవలను నిలిపివేస్తామని ప్రకటించారు. జూడాలను ఇవాళ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. 

also read:ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసు

ఏపీ డిప్యూటీ సీఎ: ఆళ్లనాని, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్. డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావులు  జూడాలతో చర్చించనున్నారు. రాష్ట్రంలోని సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులకు సూపర్‌ స్పెపాలిటీ వైద్యులకు స్టయిపెండ్‌ను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెసిడెంట్‌ స్పెషలిస్ట్‌ డిగ్రీ వాళ్లకు నెలకు రూ.70 వేలు, రెసిడెంట్‌ డెంటి్‌స్టలకు రూ.65 వేలు, రెసిడెంట్‌ సూపర్‌ స్పెషలి్‌స్టలకు రూ.85 వేలను అందించనున్నారు. పెంచిన స్టయిపెండ్‌ గతేడాది సెప్టెంబరు నుంచి అమలవుతుంది. గత నెలలో తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం జూడాల డిమాండ్లన పరిష్కరించింది. దీంతో జూడాలు సమ్మెను విరమించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios