‘‘చంద్రబాబు.. వీది రౌడీ’’

jogi ramesh slams chandrababu over naini brahmins issue
Highlights

చంద్రబాబుపై మండిపడ్డ జోగి రమేష్

చంద్రబాబు ఓ వీది రౌడీలా ప్రవర్తిస్తున్నారని  వైసీపీ నేత జోగి రమేష్ మండిపడ్డారు. నాయి బ్రాహ్మణులు కనీస వేతనాలు కల్పించాలని అడిగితే తీసేస్తాం, విధుల్లోకి రానివ్వకుండా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు బెదిరింపులకు పాల్పడటం దారుణమని  ఆయన అన్నారు.

నాయి బ్రాహ్మణులు కనీస వేతనాల కోసం అడిగితే సీఎం వీధి రౌడీలా దిగజారి మాట్లాడారన్నారు. మత్సకారులను బీసీల్లో నుంచి ఎస్టీల్లో చేరుస్తానని మేనిఫెస్టోలో పెట్టిన హామీని నెరవేర్చాలని చంద్రబాబును కలవడానికి వెళితే వారిపై బెదిరింపులకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి పదవి స్థాయిని తగ్గించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు.

కనీస వేతన చట్టం ఉంది అనే విషయం తెలియకుండా చంద్రబాబు మాట్లాడటం దారుణమని జోగి రమేష్‌ నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు టీడీపీకి బీసీలు పట్టుకొమ్మలు అని, ఇప్పుడు తాట తీస్తా, తోలు తీస్తా అంటున్నారని తెలిపారు. బీసీలను ఎన్నికల్లో పావులుగా వాడుకుని ఇప్పుడు తరిమికొడతారా? అంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని అడగడం తప్పా? మేము ఏమైనా మీ దోపిడిలో వాటాలు ఆడిగామా అని ప్రశ్నించారు. 

loader