గుండాయిజం కట్టడి: బెజవాడ పోలీసుల వినూత్న ఆలోచన.. రౌడీలకు స్పెషల్ జాబ్ మేళా

గుండాయిజాన్ని అరికట్టడానికి విజయవాడ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. రౌడీయిజం కారణంగా మంచి భవిష్యత్తును కోల్పోయిన వారికి, సమాజంలో గౌరవంగా బతికేలా దారి చూపుతున్నారు నగర పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా. 
 

job mela organized by vijayawada police for rowdy sheeters

నగరాల్లో రౌడీలు, రౌడీషీటర్ల దందా ఎక్కువగా నడుస్తూ వుంటుంది. సెటిల్‌మెంట్లు, గొడవలు, ఆక్రమణలు, దాడులు, హత్యలు, కిడ్నాప్‌లతో వీరు  పోలీస్ శాఖకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటారు. వీరిని కట్టడి చేయడానికి పోలీసులు ఏ స్టైల్‌లో పనిచేస్తారో అందరికీ తెలుసు. ఇలాంటి వారిని పూర్తిగా మార్చేసేందుకు పోలీసులు ఎన్నో సార్లు ప్రయత్నించారు. కానీ ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు. అయితే బెజవాడ పోలీసులు (Vijayawada police) వినూత్నంగా ఆలోచించారు. రౌడీయిజం కారణంగా మంచి భవిష్యత్తును కోల్పోయిన వారికి, సమాజంలో గౌరవంగా బతికే దారి చూపుతున్నారు . 

ఈ నేపథ్యంలోనే రౌడీషీటర్ల కోసం జాబ్ మేళా నిర్వహించారు నగర పోలీసులు. విజయవాడలో రౌడీషీటర్ల (rowdy sheeters)సమస్య ఎప్పటినుంచో ఉందని, వారితో మాట్లాడే సమయంలో సమస్యలు అర్థం చేసుకున్నానని చెప్పారు విజయవాడ సీపీ కాంతిరాణా టాటా. ఉపాధి అవకాశాలు కల్పిస్తామనడంతో చాలా మంది ముందుకొచ్చారని, పాత జీవితాన్ని వదిలి సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని రౌడీషీటర్లకు సీపీ  సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉపాధి కల్పించే చర్యలు చేపట్టామని, 16 కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు క్రాంతిరాణా టాటా (kanthi rana tata).

యువత జీవితాన్ని దశల వారిగా నిర్దారించుకుని ప్రణాళికా బద్దంగా ముందుకు సాగాలని సూచించారు సీపీ. సమాజంలో ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదని, విద్య ద్వారానే అభివృద్ధి చెందుతారని వివరించారాయన. తెలిసి తెలియక చేసిన తప్పులను వదిలి కుటుంబం కోసం గౌరవంగా జీవించాలన్నారు. 5, 6 సవంత్సరాలు కష్టపడి పని చేసి గోల్ రిచ్ అవ్వగలిగితే, జీవితం అంతా సుఖంగా ఉండొచ్చని చెప్పారు సీపీ.

పాత జీవితాన్ని వదిలి సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని రౌడీ షీటర్లకు సూచించారు సీపీ కాంతి రాణా. విజయవాడ అంటే గతంలో రౌడీషీటర్లకు అడ్డాగా వుండేదని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదన్నారు వైసీపీ నేత, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు (malladi vishnu). పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వచ్చిన తరువాత నగరంలో చాలా మార్పులు వస్తున్నాయని ప్రశంసించారు. తప్పు దారిపట్టిన వారిని సన్మార్గంలో పెట్టేందుకు పోలీస్‌గా విధులు నిర్వర్తించడంతో పాటు వారికి జీవనోపాధి కల్పించే విధంగా జాబ్ మేళా నిర్వహించడం సంతోషంగా వుందన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios