జియో మరో బంపర్ ఆఫర్.. యూజర్లందరికీ ఉచితంగా 8 జీబీ డేటా

Jio Users Receiving 8GB of Complimentary Data Under Cricket Teaser Pack
Highlights

రూపాయి చెల్లించకుండానే 8జీబీ డేటా ఉచితంగా

ప్రముఖ టెలికాం సంస్థ జియో.. మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో నెట్‌వర్క్‌ను వాడుతున్న ప్రతి వినియోగదారుడికి 8 జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది.  8జీబీ డేటా ఉచితంగా పొందాలంటే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలాంటి ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాల్సిన పనిలేదు. ఇప్పటికే జియో 8జీబీ డేటాను ఆటోమేటిక్‌గా కస్టమర్ల అకౌంట్లకు యాడ్ చేసింది. కావాలంటే ఎవరైనా జియో యాప్‌లోకి లాగిన్ అయి తమకు యాడ్ అయిన డేటా వివరాలను తెలుసుకోవచ్చు. ఈ డేటా క్రికెట్ ప్యాక్ కింద యాడ్ అయింది. 

జియో టీవీ యాప్ ద్వారా ఐపీఎల్ ప్రసారాలను వీక్షించే వెసులుబాటును జియో కల్పించిన విషయం విదితమే. దీంతోపాటు అనేక చానల్స్‌ను కూడా ఆ యాప్‌లో చూసేందుకు వీలుంది. ఈ క్రమంలోనే నాణ్యమైన ప్రసారాలను, సేవలను అందిస్తున్నందున జియో టీవీ యాప్‌కు బెస్ట్ మొబైల్ వీడియో కంటెంట్ అవార్డు వచ్చింది. జీఎస్‌ఎంఏ గ్లోబల్ మొబైల్ అవార్డుల్లో భాగంగా జియో ఈ అవార్డును కైవసం చేసుకుంది. దీంతో జియో అందుకు బహుమతిగా 8 జీబీ డేటాను యూజర్లకు ఉచితంగా యాడ్ చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ డేటాను రోజుకు 2జీబీ చొప్పున 4 రోజుల్లో వాడుకోవాల్సి ఉంటుంది.

loader