జనసేనకు మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ గురువారం నాడు రాజీనామా చేశారు.   రాజీనామా లేఖను  లక్ష్మీనారాయణ పార్టీ  చీఫ్ పవన్ కళ్యాణ్‌కు పంపారు.

రాజీనామా లేఖను  లక్ష్మీనారాయణ పార్టీ  చీఫ్ పవన్ కళ్యాణ్‌కు పంపారు.పూర్తికాలం పాటు ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పిన విషయాన్ని జనసేన నేత లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. 

Also read:మూడు రాజధానులకు కేంద్రం అనుమతి లేదు:పవన్ కళ్యాణ్

జనసేనకు రాజీనామా చేస్తూ పవన్ కళ్యాణ్ కు ఓ లేఖను రాశారు జేడీ లక్ష్మీనారాయణ. ఈ లేఖను లక్ష్మీనారాయణ మీడియాకు విడుదల చేశారు. సినిమాలలో నటించనని కూడ పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

 పవన్ కళ్యాణ్ ‌కు విధి విధానలు  లేవని ఘాటుగా విమర్శలు గుప్పించారు. సినిమాలకు తాను దూరమని పవన్ కళ్యాన్ పదే పదే ప్రకటించి ఇప్పుడు సినిమాల్లో నటించడంపై  జేడీ లక్ష్మీనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడం తనకు బాధను కల్గిస్తోందన్నారు. 

పవన్ కళ్యాణ్ తీరుతో తాను పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన ప్రకటించారు.ఈ మేరకు పార్టీకి రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించారు.పవన్ కళ్యాణ్ నిలకడలేని నిర్ణయాలు తీసుకొంటున్నారని జేడీ లక్ష్మీనారాయణ ఆరోపించారు. 


జనసేన పార్టీ కార్యకర్తలకు తాను వ్యక్తిగతంగా అందుబాటులో ఉంటానని లక్ష్మీనారాయణ ఆ ప్రకటనలో చెప్పారు.బీజేపీతో జనసేన పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ పార్టీలో ఇతర నాయకులతో చర్చించలేదనే విమర్శ ఉంది. 

గత ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో  విశాఖ పట్టణం నుండి ఎంపీగా జనసేన నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.ఎన్నికల ముందు జనసేనలో జేడీ లక్ష్మీనారాయణ చేరారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో జేడీ లక్ష్మీనారాయణ  అంటీముట్టన్నట్టుగా ఉంటున్నారు.

గత ఏడాది చివర్లో విశాఖపట్టణంలో ఇసుక కొరతను నిరసిస్తూ జరిగిన లాంగ్ మార్చ్ కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆ మరునాడే జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. కొంతకాలంగా జేడీ లక్ష్మీనారాయణ దూరమౌతారని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి ఊతమిస్తూ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు దూరమయ్యారు.