Asianet News TeluguAsianet News Telugu

జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా: బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం

టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి అనంతపురం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో కడప జైల్లో ఉన్న జేసీకి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

jc prabhakar reddy gets bail due to tested corona positive
Author
Tadipatri, First Published Aug 19, 2020, 7:27 PM IST

టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి అనంతపురం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో కడప జైల్లో ఉన్న జేసీకి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో ఆయన ఆరోగ్య పరిస్ధితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్ధించారు. కాగా, వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి 55 రోజుల పాటు కడప జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

ఈ కేసులో బెయిల్ మీద విడుదలై ఇంటికొస్తుండగా కోవిడ్ 19 నిబంధనల మేరకు వాహనాల ర్యాలీకి ఓ పోలీస్ ఉన్నతాధికారి అనుమతి ఇవ్వలేదు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.

ఆయన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి మరుసటి రోజే కడప జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో మంగళవారం కడప జైళ్లో ఉన్న ఖైదీలకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా అందులో 317 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో జేసీ ప్రభాకర్  రెడ్డి కూడా ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios