టీడీపీ నేతలపై దొంగ కేసులు పెడుతున్నారని వాపోయారు. మీ వైఫల్యం కారణంగానే రాష్ట్రానికి బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ కి తీవ్ర నష్టం జరిగిందని టీడీపీ నేత, జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని బీజేపీ అలాంటి నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. 28 మంది ఎంపీలు ఉండి ఏమి చేస్తున్నారని పవన్ రెడ్డి ప్రశ్నించారు. తూతూ మంత్రంగా విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఇస్తున్నారన్నారు. 

టీడీపీ నేతలపై దొంగ కేసులు పెడుతున్నారని వాపోయారు. మీ వైఫల్యం కారణంగానే రాష్ట్రానికి బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రైతు సమస్యలపై దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోందని పవన్ రెడ్డి పేర్కొన్నారు. 

రాష్ట్రంలో మద్యం... పెట్రోల్ డీజల్ ధరలు అధికంగా ఉన్నాయని.. దీని ప్రభావం సామాన్యులపై తీవ్రంగా పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లిస్తున్నందునే బడ్జెట్‌లో కేటాయింపులు లేవన్నారు. 

ఒక వైపు దాడులు.. మరోవైపు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కొడాలి నాని నోటిని ఫినాయిల్ వేసి కడిగినా మంచి మాటలు రావన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభ్యర్థనగా మాట్లాడినా తప్పుడు కేసులు పెట్టారని పవన్ రెడ్డి పేర్కొన్నారు.