చంద్రబాబుకి షాకిచ్చిన జేసీ, కేసీఆర్ ప్లాన్ ఇది

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 28, Aug 2018, 3:21 PM IST
jc diwakar reddy shock to chandrababu and kcr
Highlights

చంద్రబాబుతోపాటు.. కేసీఆర్ ని కూడా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలు కావాలనడంలో ఆయన ప్లాన్ ఏంటో జేసీ బయటపెట్టాడు. 

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముందుంటారు. సొంత పార్టీపైనే విమర్శలు చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. తాజాగా మరోసారి ఆయన చంద్రబాబుని ఇరకాటంలో పడేశారు. ఇప్పటివరకు రాష్ట్ర విభజన విషయంలో ఎఫెక్ట్ అంతా కాంగ్రెస్ పార్టీ మీదనే ఉంది. కాగా.. ఆ పాపంలో టీడీపీకి కూడా వాటా ఉందని జేసీ పేర్కొనడం గమనార్హం.

మంగళవారం ఆయన అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉంది... కాంగ్రెస్ పార్టీ టీడీపీ మద్దతు కోరుతోంది... రాష్ట్రాన్ని దెబ్బ తీయడంలో అందరి పాత్ర ఉన్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తే తప్పు లేదు..’ అని జేసీ అన్నారు. 

అలాగే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో టీడీపీ లేదని, ఆంధ్రాలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదన్నారు. తెలంగాణలో పొత్తును ఏపీ ప్రజలు హర్షిస్తారని, కానీ ఏపీలో అవసరం లేదని, నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోడు.. అని జేసీ అన్నారు. బీజేపీని నమ్మి మోసపోయామని, అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం చేస్తామని కాంగ్రెస్ అంటోందని, కాంగ్రెస్‌ని నమ్మి చూస్తే తప్పేమీ ఉందంటూ... జేసీ వ్యాఖ్యానించారు. అలాగే విభజన పాపం కాంగ్రెస్, టీడీపీల రెండింటిది ఉందని, పొత్తుల విషయంలో ఎన్టీఆర్ నాటి పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరు అని పేర్కొన్నారు.

చంద్రబాబుతోపాటు.. కేసీఆర్ ని కూడా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలు కావాలనడంలో ఆయన ప్లాన్ ఏంటో జేసీ బయటపెట్టాడు. రాజకీయ కుయుక్తిలో భాగంగానే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్.. బీజేపీతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఉందని వివరించారు. ఆ లోపు ఇక్కడ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. ముస్లిం ఓటర్లను కోల్పోకుండా ఉండవచ్చని కేసీఆర్ ప్లాన్ వేశారని జేసీ అన్నారు. 

loader