అనంతపురం: ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తాను రాజకీయ విమర్శలు చేశానని.... కానీ, జగన్‌ను ఏనాడూ కూడ ద్వేషించలేదని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

సోమవారం నాడు జేసీ దివాకర్ రెడ్డి ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. తాను రాజకీయాల నుండి తప్పుకొంటున్నట్టుగా ఆయన ప్రకటించారు.  జగన్ మా వాడేనని ఆయన ప్రకటించారు. అయితే తాను పార్టీ మారాలనుకోవడం లేదన్నారు.

ప్రధానమంత్రి మోడీతో జగన్ వ్యవహరిస్తున్న తీరును జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసించారు. ఈ తీరుతో  ఏపీలో శుభపరిణామంగా ఆయన ప్రకటించారు. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ‌ చీఫ్ వైఎస్ జగన్‌పై  జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం... దివాకర్ రెడ్డి కుటుంసభ్యులు ఇద్దరూ కూడ ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఈ తరుణంలో జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.