Asianet News TeluguAsianet News Telugu

టీడీపి భేటీకి జేసి బ్రదర్స్ డుమ్మా: బాలకృష్ణ సైతం. చంద్రబాబు ఆరా

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి కీలకమైన నేతలు కొందరు హాజరు కాలేదు. వారిలో మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వారి స్థానాల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారి కుమారులు జెసి పవన్ రెడ్డి, జెసి అస్మిత్ రెడ్డి సమావేశానికి డుమ్మా కొట్టారు. 

JC brothers skip TDP review meeting
Author
Anantapur, First Published Jul 1, 2019, 1:27 PM IST

అనంతపురం: ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్ష జరిపేందుకు ఏర్పాటైన అనంతపురం జిల్లా నేతల సమావేశానికి జెసి సోదరులు హాజరు కాలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆదివారం తొలిసారి టీడీపి అనంతపురం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. 

జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి బికే పార్థసారథి, మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీలు గుండుమల తిప్పేస్వామి, శమంతకమణి, మేయర్ స్వరూప, మాజీ శాసనసభ్యులు పల్లె రఘునాథ రెడ్డి, జతేంద్ర గౌడ్, యామినీ బాల, కందికుంట వెంకటప్రసాద్, ఈరన్నలు హాజరయ్యారు. పరిటాల శ్రీరామ్ కూడా ఈ సమావేశానికి వచ్చారు. 

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి కీలకమైన నేతలు కొందరు హాజరు కాలేదు. వారిలో మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వారి స్థానాల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారి కుమారులు జెసి పవన్ రెడ్డి, జెసి అస్మిత్ రెడ్డి సమావేశానికి డుమ్మా కొట్టారు. 

హిందూపురం మాజీ పార్లమెంటు సభ్యుడదు నిమ్మల కిష్టప్ప, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా సమావేశానికి రాలేదు. బాలకృష్ణ కూడా సమావేశానికి రాలేదు. చంద్రబాబుతో కలిసి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినందున ఆయన సమావేశానికి హాజరు కాలేకపోయారు .అయితే, కొంత మంది నేతలు ఎందుకు డుమ్మా కౌట్టారనే విషయంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. 

ధర్మవరం మాజీ శాసనసభ్యుడు గోనుగుంట్ల సూర్యనారాయణ బిజెపిలో చేరడంపై సమావేశంలో చర్చించారు. అక్కడ బలమైన నాయకుడిని ఇంచార్జీగా నియమించాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios