జగన్ మాటల ఎఫెక్ట్... జనసేన కార్యకర్తల మౌనదీక్ష

janasena supporters mouna deksha in vijayanagaram
Highlights

నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని కలెక్టరేట్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. జగన్ చేసిన కామెంట్లకు నిరసనగా.. విజయనగరంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు గురువారం ఉదయం కలెక్టర్ వద్ద నిరసనకు దిగారు. 

నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని కలెక్టరేట్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. విలువలు గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, 2019 ఎన్నికల్లో ఓడి పోతాం అనే భయంతో జగన్ మాట్లాడుతున్నారని జనసేన, పవన్ అభిమానులు మండిపడ్డారు. 

జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో మహిళలు ఆయన్ను ఛీకొడుతున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో రవికుమార్ మిడతాన, రవితేజ, చక్ర వర్తి, గాడు రవి, అరుణ్, హుస్సేన్,బాబు సంతోష్, దుర్గేష్, సత్తి రెడ్డి, రాజేష్, అనిల్,రాజు పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

loader