శ్రీరెడ్డిని చెల్లిగా సంబోధించిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ట్విట్టర్ లో ట్వీట్ల మోత మోగిస్తున్నాడు. తనపై కుట్రలు చేస్తున్న మీడియా ఛానెళ్లు.. వాటి అధినేతలపై ట్వీట్ యుద్ధం సాగిస్తున్నాడు. గత నాలుగు రోజులుగా పలు ట్వీట్లు చేసిన పవన్ మంగళవారం ఉదయం మరిన్ని ఆసక్తికర ట్వీట్లు చేశారు. తెలంగాణ పోలీసులను ఆశ్రయిస్తానని ట్వీట్ చేసిన పవన్.. శ్రీరెడ్డిని చెల్లిగా సంభోదించడం గమనార్హం.
గత ఆరు నెలలుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు కోసం తెలంగాణ పోలీసులను ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ఈ దెబ్బతో తనను అప్రతిష్టపాలు చేసేందుకు యత్నిస్తున్న పురుషులు, మహిళల జాతకాలన్నీ బటయకు వస్తాయని.. అది క్రమంగా అమరావతి వైపు దారితీస్తుందంటూ ఆయన తెలిపారు. ‘ఒకవేళ దర్యాప్తు జరిగితే ప్రముఖుల కుటుంబాలు, రాజకీయ నాయకులు, మీడియా అధిపతులు, వారి పిల్లలు... అందరూ బయటకు వస్తారు. సమాజంలోని కుళ్లంతా బయటపడుతుంది’ అని పవన్ పేర్కొన్నారు. ‘మీరంతా కలిసి ఓ చెల్లి బట్టలిప్పేలా ప్రొత్సహించారు. దాన్ని మీడియా షో చేసింది. కానీ, దర్యాప్తులో వెలుగు చూసే నిజాలు మీ షోలన్నింటి కంటే పెద్దదే అవుతుంది’ అంటూ పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు చేశారు.
కాగా.. తన తల్లిని అభ్యంతరకర పదజాలంతో తిట్టిన శ్రీరెడ్డిని పవన్ చెల్లిగా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది
