చిత్తూరు జిల్లా పుంగనూరు, అన్నమయ్య జిల్లా అంగళ్లులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షోపై వైసీపీ శ్రేణుల దాడిని జనసేన చీప్ పవన్ కల్యాణ్ ఖండించారు. పుంగనూరులో చోటు చేసుకున్న పరిణామాలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి అని జనసేన అధినేత స్పష్టం చేశారు. 

చిత్తూరు జిల్లా పుంగనూరు, అన్నమయ్య జిల్లా అంగళ్లులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షోపై వైసీపీ శ్రేణుల దాడిని జనసేన చీప్ పవన్ కల్యాణ్ ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షం గొంతు వినిపించకూడదనే నియంతృత్వం పెచ్చరిల్లుతోందని.. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ వైఖరి ప్రతిపక్షం గొంతు నొక్కేలా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ నాయకుల అరాచకాలతో ఇబ్బందులు పడుతున్నారని.. ప్రజల తరఫున పోరాడటం ప్రతిపక్షాల బాధ్యత అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

Scroll to load tweet…

ఈ రోజు పుంగనూరులో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు వాంఛనీయం కాదన్నారు. ఆయన పర్యటనను అడ్డుకొనేందుకు వైసీపీ వ్యక్తులు రాళ్ల దాడులకు పాల్పడటం, వాహనాలు ధ్వంసం చేయడం అధికార పార్టీ హింసా ప్రవృతిని తెలియచేస్తోందని పవన్ పేర్కొన్నారు. పుంగనూరులో చోటు చేసుకున్న పరిణామాలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి అని జనసేన అధినేత స్పష్టం చేశారు. 

ALso Read: గూండాలతో, గన్‌లతో ..పక్కా స్కెచ్‌తో పుంగనూరుకి .. అన్నింటికీ చంద్రబాబే ముద్దాయి : పెద్దిరెడ్డి

అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం పుంగనూరులో జరిగిన రోడ్ షోలో ఆయన ప్రసంగిస్తూ.. పుంగనూరుకు పెద్దిరెడ్డి ఏమైనా పుడింగా అంటూ వ్యాఖ్యానించారు. ఈ రోడ్డు మీదుగా తనను రావొద్దు అనటానికి ఈ రోడ్డు పెద్దిరెడ్డి తాత జాగీరా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అంగళ్లు, పుంగనూరులలో ఇవాళ జరిగిన విధ్వంసానికి పెద్దిరెడ్డి, పోలీసులే కారణమని చంద్రబాబు ఆరోపించారు. విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజలు తిరగబడితే మీరు పోతారంటూ ఆయన హెచ్చరించారు. 

తాను మళ్లీ వస్తానని.. పుంగనూరు మొత్తం తిరుగుతానని చంద్రబాబు వెల్లడించారు. తలలు పగులుతున్నా.. నెత్తురోడుతున్నా నిలబడిన టీడీపీ కేడర్‌ను ఆయన అభినందించారు. చల్లా బాబుపై దెబ్బపడితే తనపై పడ్డట్లేనని.. ప్రజలకు అండగా వుంటానని, వై నాట్ పుంగనూరు, వై నాట్ 175 అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ చెప్పిన స్క్రిప్ట్‌ను దేవుడు తిరగరాశాడని ఆయన అన్నారు. పుంగనూరులో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. అధికార పార్టీకి దాసోహం కావొద్దు.. శాంతి భద్రతలను కాపాడాలని చంద్రబాబు పోలీసులను హెచ్చరించారు. 

Also Read: ఇవాళ్టీ విధ్వంసానికి కారణం పెద్దిరెడ్డే .. ఆయనేమైనా పెద్ద పుడింగా, వైనాట్ పుంగనూరు : చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

కాగా.. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు, వైసీపీ నేతలు యత్నించడంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలీస్ వాహనాలపై దాడులకు దిగిన వారు.. రెండింటికి నిప్పు పెట్టారు. దీంతో టీటీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వారు శాంతించకపోవడంతో భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.