నరసాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు. 

ఇకపై ఏపీలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ జనసేన పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించిన నాగబాబు  జనసేన కార్యకర్తలపై అధికార పార్టీ దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు.

జనసేన పార్టీ సైనికుల్ని వైసీపీ నేతలు వేధిస్తే సహించేది లేని నాగబాబు హెచ్చరించారు.ఇకపోతే జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూడటంతో ఇకపై రాబోయే ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా జనసేన పార్టీ పొలిటికల్ బ్యూరో కమిటిని నియమించారు పవన్ కళ్యాణ్.

అలాగే పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిగా నాగబాబును నియమించారు పవన్ కళ్యాణ్. 

పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన పవన్ కళ్యాణ్: నాగబాబుకు కీలక పదవి