అమరావతి: అసెంబ్లీ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికగా  ఉండాలని ఆకాంక్షించారు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ప్రజల సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే అసెంబ్లీలాంటి వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. 

ఎమ్మెల్యేలకు ప్రభుత్వం శిక్షణ  కార్యక్రమం నిర్వహించడం బాగుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. సీనియర్స్, నిపుణులతో శిక్షణ ఇవ్వడం వల్ల మంచి అవగాహన ఏర్పడిందన్నారు. 

అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు వినిపించేందుకు సీఎం జగన్ అవకాశం ఇస్తామని చెప్పడం మంచి పరిణామమన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తన వాయిస్ వినిపిస్తానని రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు.