ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సమయంలో రైతు కోటయ్య మృతి చనిపోయిన తీరు అనుమానాస్పదంగా ఉందని జనసేన పార్టీ నేత రావెల కిశోర్ బాబు అన్నారు. ఈ ఘటనపై తక్షణం న్యాయ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం రావెల.. కోటయ్య కుటుంబసభ్యులను కలిశారు. వారిని ఓదార్చి.. జనసేన తరపు నుంచి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.

అనంతరం రావెల మాట్లాడుతూ.. కోటెల మరణం వార్త తెలుసుకొని పవన్ కళ్యాణ్ ఆవేదనకు గురయ్యారని చెప్పారు. “రైతు మృతిలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. ఘటనకు  ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. న్యాయ విచారణ చేయడంతోపాటు ప్రభుత్వం ఆ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం ఇచ్చి ఒక ఎకరా పొలం మంజూరు చేయాలి.  మృతుని కుమారుడు కి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలి.  బాధిత  కుటుంబానికి జనసేన పార్టీ అండగా  ఉంటుంది బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు జనసేన పోరాడుతుంద”ని స్పష్టం చేశారు.