అనంతపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన సాకే పవన్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. 

ప్రకాశ్ రెడ్డిని నరుకుతా లేకపోతే ఏ రెడ్డి తలనైనా నరుకుతా అంటే పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. కులాలకు కులాలకు మధ్య చిచ్చు పెట్టేలా పవన్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

ప్రకాశ్ రెడ్డినే కాదు ఏ రెడ్డి తలనైనా నరుకుతానని సాకే పవన్ వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. నరుకుతానంటే వి వెలకమ్ అంటూ చెప్పుకొచ్చారు. చట్టం ఉంది, పోలీసులు ఉన్నారువారే చూసుకుంటారన్నారు. ఈ వ్యాఖ్యలపై తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. 

ఇలాంటి పిచ్చిపిచ్చి కూతలు కూయించడం పవన్ కళ్యాణ్ కు సరికాదని ఇలాంటి వ్యాఖ్యలకు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు మంచి సత్కారమే ఇస్తారని చెప్పుకొచ్చారు. 

పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా రావాలని ఇక్కడకు రావాలని ఎంతమంది తలలు నరుకుతారో చెప్పాలని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు. జనసేన కార్యకర్త అయిన సాకే పవన్ కుమార్ తన ఇమేజ్ పెంచుకునేందుకు తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. 

జనసేన కార్యకర్త మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లుగా తాము భావిస్తున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎంతమంది తలలు నరుకుతారో చెప్పాలని లేదా అనంతపురం వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఏ రెడ్డి తలనైనా నరుకుతానన్న పవన్ కు సపోర్ట్ : జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఈ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కు ఎలాంటి సంబంధం లేకపోతే చింతిస్తున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేయాలని లేకపోతే అనంతపురం వచ్చి ఎంతమంది తలలు నరుకుతారో చెప్పాలని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఇకపోతే ఈ వ్యాఖ్యల వెనుక తెలుగుదేశం పార్టీ కూడా ఉండి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 

సమావేశాల్లో ఎవరికిపడితే వారికి మైకులు ఇచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కు విజ్ఞత ఉందని భావించానని కానీ ఈ పరిణామాలు చూస్తుంటే లేదనిపిస్తోందన్నారు. ఒక స్థాయికి తగ్గ వ్యక్తులతో మాట్లాడించాలే తప్ప అనుచరులకు మైకులు ఇచ్చి వాళ్లని నరుకుతా వీళ్లని నరుకుతా అంటే చూస్తూ ఊరుకుంటారా అంటూ మండిపడ్డారు.  

సాకే పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరో తనకు తెలియదని ఆ పేరు కూడా నియోజకవర్గంలో వినలేదని చెప్పుకొచ్చారు. అడ్రస్ లేనివాళ్లను తీసుకువచ్చి పవన్ కళ్యాణ్ తనలాంటి వారిపై విమర్శలు చేయించడం సరికాదని ఇప్పటికైనా పవన్ తన రాజకీయవైఖరి మార్చుకోవాలని సూచించారు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. 

ప్రకాష్ రెడ్డి కాదు, ఏ రెడ్డి తలనైనా నరుకుతా: పవన్ సమక్షంలో సాకే పవన్ వ్యాఖ్యలు