మోడీ ఆత్మ నిర్బర్ భారత్‌ను ముందుకు తీసుకెళ్తామన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆత్మనిర్బర్ కోసం బీజేపీ, జనసేన కలిసి కృషి చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.

ఆత్మనిర్బర్ భారత్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని జనసేనాని అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని.. ఆ రోజు నుంచి దీనిని ముందుకు తీసుకెళ్తామని పవన్ చెప్పారు. మనదేశంలో ఏ పనులైనా గణపతి పూజతోనే మొదలుపెడతామని ఆయన స్పష్టం చేశారు.

అందుకే ఈ వినాయక చవితి నుంచే ఆత్మనిర్బర్ భారత్‌ను మొదలుపెడుతున్నట్లు పవన్ తెలిపారు. ఆత్మనిర్బర్ భారత్ ఒక వర్గానికి చెందినది కాదన్న ఆయన.. ఇది ప్రజలందరికీ సంబంధించినదని చెప్పారు.