గొడవలు, దౌర్జన్యాలు చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శనివారం తూర్పుగోదావరి జిల్లా తునిలో పర్యటించిన ఆయన దివిస్ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికులకు మద్ధతు పలికారు.

తన సభలకు చిన్నపిల్లలే వస్తారని... కారణం వాళ్ల భవిష్యత్ కోసం తాను పోరాడుతున్నానని చెప్పారు. వైసీపీకి, జగన్‌కి, దివీస్‌కు తాను వ్యతిరేకం కాదని పవన్ స్పష్టం చేశారు. వాళ్ల విధానాలకు మాత్రమే వ్యతిరేకమని.. నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

తమకు ఎమ్మెల్యేలు లేకపోయినా పోరాటాలు చేస్తానని పవన్ స్పష్టం చేశారు. ప్రజలు నమ్మరు వదిలేయి అని చాలా మంది చెప్పారని.. నా ఇంట్లో బిడ్డలను వదిలేస్తానా..? అని జనసేనాని ప్రశ్నించారు.